Published On:

Vijayashanti: నా ట్యాగ్ పెట్టుకొని ఆ హీరోయిన్లు బతుకుతున్నారు.. పోనిలే అని వదిలేసా

Vijayashanti: నా ట్యాగ్ పెట్టుకొని ఆ హీరోయిన్లు బతుకుతున్నారు.. పోనిలే అని వదిలేసా

Vijayashanti:  లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రస్తుతం ఒకపక్క రాజకీయాల్లో.. ఇంకోపక్క సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా మారింది. కథలు నచ్చితే సినిమాలు చేయడం తనకు ఇష్టమే అని చెప్పుకొచ్చిన ఆమె.. చాలాకాలం తరువాత సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత మళ్లీ  గ్యాప్ తీసుకున్న విజయశాంతి.. ఈమధ్యనే అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాలో కనిపించింది.

 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు. వైజయంతీ పాత్రలో విజయశాంతి నటనకు మంచి మార్కులే పడ్డయి. 58 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె యాక్షన్ సీక్వెన్స్ ఎలాంటి డూప్ లేకుండా  చేసి లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో మేకర్స్ సక్సెస్ మీట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కూడా విజయశాంతి పాల్గొంటుంది. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ఆమె తన ట్యాగ్ గురించి చెప్పుకొస్తూ కుర్ర హీరోయిన్లకున గట్టి కౌంటర్ ఇచ్చింది.

 

లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ మొదట విజయశాంతికే దక్కింది. ఆ తరువాత ఆ ట్యాగ్ ను అరుంధతి సినిమా తరువాత అనుష్కకు, తమిళ్ స్టార్ హీరోయిన్ నయనతారకు వచ్చింది. ఇక వీరి గురించి, ఆ ట్యాగ్ గురించి  విజయశాంతి మాట్లాడుతూ .. “లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ నాకు ప్రతిఘటన తరువాత ప్రజలు ఇచ్చారు. నేను యాక్టివ్ గా లేనప్పుడు కొందరు హీరోయిన్లు ఆ టీజీ తీసుకున్నారు. పాపం వాళ్లు కూడా బతకాలి కదా అని నేను పట్టించుకోలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

 

నిజం చెప్పాలంటే అనుష్కకు కూడా ప్రజలే ఆ ట్యాగ్ ను ఇచ్చారు. ఆమె ఏరోజు తనకు తానూ లేడీ సూపర్ స్టార్ అని చెప్పింది లేదు. ఇక నయన్ విషయానికొస్తే.. ఆమె ఈ ట్యాగ్ ను బాగానే ఉపయోగించుకుంది. ఈ మధ్యనే తన పేరు ఉన్న లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ను తీసివేయాలని, తనను అలా పిలవద్దని అభిమానులను కోరింది. ఇక ఇప్పుడు విజయశాంఠీ ఇన్ డైరెక్ట్ గా తానూ మాత్రమే లేడీ సూర్ స్టార్ అని చెప్పుకురావడం ఆశ్చర్యంగా ఉందాం నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: