Published On:

RR Target in 42nd Match: రాణించిన కోహ్లీ, పడిక్కల్.. రాజస్థాన్ లక్ష్యం ఎంతంటే..?

RR Target in 42nd Match: రాణించిన కోహ్లీ, పడిక్కల్.. రాజస్థాన్ లక్ష్యం ఎంతంటే..?

Royal Challengers Bengaluru High score against Rajasthan Royals IPL 2025 42nd Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు సాల్ట్(26), విరాట్ కోహ్లీ(70) మంచి శుభారంభం అందించారు. సాల్ట్ ఔట్ అయిన తర్వాత వచ్చిన పడిక్కల్(50) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. చివరిలో టిమ్ డేవిడ్(23), జితేశ్ శర్మ(20) రాణించడంతో బెంగళూరు 200 మార్కును దాటింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, హసరంగ చెరో వికెట్ తీశారు.