Home / Telangana
KCR Comments on Chandrababu: కేసీఆర్ పాత నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా? మళ్లీ చంద్రబాబు పేరు ప్రస్తావించడం దేనికి సంకేతం? తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడుతుందని ఆయన భావిస్తున్నారా? ఏపీలో చంద్రబాబు గెలుపునకు కూటమి కారణమని ఆయన ఎందుకు అన్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏదైనా వ్యూహం లేకుండా కేసీఆర్ అలా మాట్లాడరు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయడం లేదు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కేసీఆర్ తీసుకొచ్చారంటే తెర వెనుక ఏదో […]
A Man rape attempt to young women in Hyderabad MMTS Train: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ యువతి ఏకంగా నడుస్తున్న రైలులో నుంచి బయటకు దూకేసింది. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారానికి యువకుడు యత్నించాడు. మహిళా కోచ్‌లో యువతితో పాటు ఇద్దరు మహిళలు […]
Road accident : ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని దంపతులు, 8 ఏళ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను గడ్డం రవీందర్, రేణుక, […]
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సభలో ఇవాళ అపశ్రుతి చోటుచేసుకుంది. కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా కాన్వాయ్‌లో వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆమెకు కాలు విరిగింది. పార్టీ కార్యకర్తలు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. తెలంగాణ అన్నిరంగాల్లో వెనకబాటు.. సీఎం […]
Srirama Navami 2925 : భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ, భద్రాచలం దేవస్థానం అర్చకులు, అధికారులు ఆహ్వానించారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో స్వయంగా కలిసి రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా శ్రీరామనవని బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర […]
Pasala Krishna Bharathi : గాంధేయవాది పసల కృష్ణభారతి (92) ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె కృష్ణభారతి. జీవితాంతం గాంధేయవాదిగా ఉన్నారు. గాంధీజీ ప్రవచించిన విలువలతోనే ఆమె జీవించారు. పలు విద్యాసంస్థలకు నిధులు అందజేశారు. దళితుల్లో విద్యావ్యాప్తికి ఆమె ఎనలేని కృషిచేశారు. గోశాలలకు విరాళాలు కూడా సమకూర్చారు. అవివాహితగా ఉన్న కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, […]
Kishan Reddy : ఇప్పటివరకు డీలిమిటేషన్‌పై ఉన్న చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదన్నారు. డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. లేని అంశాన్ని భూతద్దంలో […]
SRH Vs RR : సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం వద్ద హైదరాబాద్ క్రికెట్ సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు 2,700 […]
Supreme Court Once Again Notices to Telangana Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఆయనకు కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్‌పై ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆయనకు తొలుత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు ఆయన స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు […]
Rain : వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట, నవాబుపేట మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులు వీయడంతో నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామ సమీపంలో భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కూడా వడగండ్ల వాన కురిసింది. ఉరుములు మెరుపులతో మొదలైన వాన దాదాపు గంట సేపు కురిసింది. దీంతో జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. జహీరాబాద్‌తోపాటు మునిపల్లి, ఝరాసంగం మండలాల్లో మోస్తరు […]