Published On:

Retro Pre Release Event: సూర్య సినిమాకు విజయ్ దేవరకొండ సాయం.. వారే తీసుకొస్తున్నారా..?

Retro Pre Release Event: సూర్య సినిమాకు విజయ్ దేవరకొండ సాయం.. వారే తీసుకొస్తున్నారా..?

Vijay Devarakonda Chief guest for Suriya’s Retro Pre release event: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా రెట్రో. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెట్రో పాన్ ఇండియా లెవెల్లో మే 1 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేశారు.

 

తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడు. ఒక్కసారి నాగవంశీ చేతికి సినిమా వచ్చింది అంటే ప్రమోషన్స్ అన్ని ఆయనే చూసుకుంటాడు అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రౌడీ హీరోను రంగంలోకి దించాడు. ఏప్రిల్ 26 న JRC కన్వెన్షన్ లో రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

 

ప్రస్తుతం విజయ్ కొత్త సినిమా కింగ్ డమ్ నాగవంశీనే నిర్మిస్తున్నాడు. అందుకే విజయ్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా తన సినిమాకు కూడా ప్రమోషన్స్ జరిగినట్లే అని విజయ్ సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఇంకోపక్క విజయ్ కు సూర్య అంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలాసార్లు చెప్పుకొచ్చాడు కూడా. ఆ ఇష్టం కూడా విజయ్ ను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకొస్తుంది. అయితే రెట్రో సినిమాకు సూర్య తగినంత ప్రమోషన్స్ చేయలేదనే చెప్పాలి.

 

కంగువ సినిమాకు సూర్య చేసిన ప్రమోషన్స్ అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా అతనే కనిపించాడు. సీనియర్ హీరోలను కలిసి.. సోషల్ మీడియా మొత్తం హైప్ తీసుకొచ్చాడు. అంత ప్రమోషన్స్ చేసినా కంగువ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఆ కారణం వలన కూడా ఈసారి సూర్య అంత గొప్పగా రెట్రో ప్రమోషన్స్ చేయడం లేదని టాక్. ఇంకోపక్క అదే రోజున నాని హిట్ 3 కూడా రిలీజ్ అవుతుంది. మరి నాని తో పోటీ పడి సూర్య గెలుస్తాడా..? లేదా..? అనేది చూడాలి.