Home / GHMC
Talasani Srinivas Yadav Meeting with GHMC Corporators: జీహెచ్ఎంసీ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం దాఖలు కావొచ్చనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పాలక మండలి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్, […]
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే ప్రజాసమస్యలపై మాట్లాడాలని బీఆర్ఎస్ పట్టుబట్టటంతో సమావేశంలో రచ్చ మొదలైంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు మేయర్‌కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగటంతో బాటు పోడియం దగ్గరకు దూసుకెళ్లి.. పేపర్లు చించి మేయర్‌పైకి విసిరారు. ఈ క్రమంలో హస్తం నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో […]
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. అయితే సమావేశానికి ముందే ప్రధాన కార్యాలయం వద్ద నుంచే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ దద్దరిల్లింది
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్తగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు.
హైదరాబాద్ తో పాటు తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం వర్షం దంచికొట్టింది. దీంతో నగరం లోని పలు ప్రాంతాలు జలమయం అవ్వగా.. ట్రాఫిక్ నిలిచిపోయింది. అలానే విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఫిలిం నగర్, ఏఎస్ రావు నగర్
GHMC: సంచలనం రేపిన వీధి కుక్కల దాడి ఘటనలో బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ నష్టపరిహారం అందించనుంది. మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ నుంచి రూ.8లక్షలు కాగా.. కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షల ఆర్ధిక సాయన్ని అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
Street Dogs: హైదరాబాద్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆడుకోవడానికి బయటకి వెళ్లిన బాలుడికి అదే చివరి రోజు అయింది. తండ్రి, అక్కతో కలిసి బయటకు వెళ్లిన బాలుడు కుక్కల దాడిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వీధికుక్కలు విచక్షణరహితంగా దాడి చేయడంతో.. బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad Roads: హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా మారుతుంది. ఎప్పుడు ఏ రోడ్డు ఎలా కుంగిపోతుందో అని వాహనదారులు నిరంతరం భయపడుతున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఉన్న పళంగా రోడ్డు కుంగిపోయింది. పది అడుగుల మేర రోడ్డు కుంగిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఓ ట్రక్కు అందులో పడిపోయింది.
ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదనుకోండి. దానిని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు నాణ్యతప్రమాణాలు లేకుండా అడ్డగోలుగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనిపై ఆహార పరిరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలోని ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఐటీ, ఫార్మా, సర్వీస్ సెక్టార్లు విస్తరిస్తున్న తరుణంలో ‘పబ్లిక్ సేఫ్టీ మెజర్స్’లో భాగంగా భద్రత ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లోనూ 8వేల సీసీ కెమెరాలు పెట్టేందుకు సిద్ధమయ్యింది.