Bigg Boss RJ Kajal: పర్యటకులపై ఉగ్రవాదుల దాడి – పహల్గామ్‌లో ఉన్న బిగ్‌బాస్ ఆర్జే కాజల్, అక్కడ పరిస్థితిపై వీడియో

RJ Kajal Shared Video on Pahalgam Attack: జమ్మూకశ్మీర్‌లో దుండగుల కాల్పుల ఘటనతో దేశం ఉలిక్కిపడింది. మంచు కొండలు, అందమైన కొండలు, పైన్ అడవులతో అందమైన ఈ ప్రదేశాన్ని రక్తమోడింది. ఎండాకాలంలో కాస్త సేద తీరుదామని పహల్గామ్‌కు వెళ్లిన పర్యాటకుల ఆనందాన్ని ఉగ్రవాదులు చెల్లాచెదురు చేశారు. దేశంలో అలజడి సృష్టించడానికి ఉగ్రవాదాలు పర్యాటకులను టార్గెట్ చేసి వారిపై కాల్పులు తెగబడ్డారు. ఈ ఘటనలో సుమారు 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పోయారు.
సమ్మర్ కావడంతో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా పర్యటనకు వెళ్లారు. బుల్లితెర జంట దీపికా కక్కర్-షొయబ్ ఇబ్రహీం కూడా పహల్గాం పర్యటనకు వెళ్లారు. అయితే ఈ దాడి ఘటనకు ముందే వారు ఆ ప్రదేశాన్ని వదిలి ఢిల్లీకి పయనయ్యారు. మరోవైపు మన తెలుగు యాంకర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ కూడా జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీలవ అక్కడికి వెకేషన్‌కి వెళ్లిన ఆమె తరచూ అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో పంచుకుంది. అయితే ఈ పహల్గాంపై ఉగ్రవాదుల దాడి ఘటన గురించి తెలిసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాజల్ ఎక్కడుంది, ఎలా ఉందని ఆమె ఫాలోవర్స్, సన్నిహితులంతా కంగారు పడుతున్నారు.
ఆమె కోసం ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నట్లు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. నా కోసం ఆరా తీసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. పహల్గాం నుంచి శ్రీనగర్ వెళ్తున్నాను. ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం స్థానిక పోలీసులు కృషి చేస్తున్నారు. రోడ్లన్ని ప్రశాంతంగా ఉన్నాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఎంతగానో బాధించింది. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ కాజల్ వీడియో రిలీజ్ చేసింది. కాజల్ వీడియో పలువురు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ స్పందించారు. ఆమెకు సన్నిహితులైన అనీ మాస్టర్, ప్రియాంక సింగ్, కిరాక్ సీతతో పలువురు జాగ్రత్తగా ఉండాలంటూ కాజల్ వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram