Published On:

Heat Wave in Telangana: రాష్ట్రంలో పెరిగిన ఎండలు.. వడదెబ్బకు 9 మంది మృతి

Heat Wave in Telangana: రాష్ట్రంలో పెరిగిన ఎండలు.. వడదెబ్బకు 9 మంది మృతి

Heat Wave in Telangana: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకు బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. పలు చోట్ల 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కావున అనవసరంగా ఎవరూ బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, హైదరాబాద్ లో 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం సమయాల్లో అవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని, తాగునీళ్లను తరుచుగా తాగాలని సూచించారు.

 

ఇదిలా ఉండగా, తెలంగాణలో ఎండల తీవ్రతకు గత 24 గంటల వ్యవధిలో 9 మంది మరణించారు. ఖమ్మం, కరీంనగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ముగ్గురు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు, వరంగల్ జిల్లాలో మరో ముగ్గురు చనిపోయారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చేతికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది.