Published On:

AP Tenth Results 2025: టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండిలా!

AP Tenth Results 2025: టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండిలా!

Nara Lokesh Released AP Tenth Results 2025: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఉదయం 10 గంటలకు పదో తరగతి ఫలితాలను ప్రకటించారు. అనంతరం పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

 

విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in లేదా http://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. దీంతో పాటు మన మిత్ర వాట్సప్, లీప్ యాప్‌లో సైతం ఫలితాలను చెక చేసుకునేలా సదుపాయం కల్పించారు. అంతేకాకుండా వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ అని వాట్సప్ ద్వారా మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. ఇందులో విద్యాసేవలు క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆప్షన్ ఎంచుకోవాలి. చివరికి రూల్ నంబర్ ఎంటర్ చేస్తే ఫలితాలు పీడీఎఫ్ కాపీ వస్తుంది.

 

కాగా, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

 

మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. తాజాగా విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అబ్బాయిలు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత అయ్యారు. మళ్లీ బాలికలే పైచేయి సాధించారు.

 

ఇదిలా ఉండగా, ఈ ఫలితాల్లో కాకినాడ విద్యార్థినికి రికార్డు మార్కులు వచ్చాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా 600కు 600 మార్కులు వచ్చాయి. కాకినాడ భాష్యం పాఠశాలకు చెందిన విద్యార్థిని నేహాంజినికి ఈ మార్కులు వచ్చినట్లు అధికారులు వివరించారు.