Published On:

Harika Narayan: పెళ్లయిన ఏడాదికే విడాకుల దిశగా ప్రముఖ సింగర్‌ – పెళ్లి, ఎంగేజ్‌మెంట్ ఫోటోలు డిలీట్‌!

Harika Narayan: పెళ్లయిన ఏడాదికే విడాకుల దిశగా ప్రముఖ సింగర్‌ – పెళ్లి, ఎంగేజ్‌మెంట్ ఫోటోలు డిలీట్‌!

Singer Harika Narayan Deleted Husband Photos: సింగర్‌ హారికా నారాయణ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్‌ భాషల్లో ఎన్నో పాటలు పాడి అలరించింది. ముఖ్యంగా ర్యాప్‌ సాంగ్స్‌, మాస్‌ పాటలకు ఆమె కేరాఫ్‌ అడ్రస్‌. తనదైన గాత్రంతో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఆమె పాడుతా తీయగా తాజా వివాదంతో ఆమె వార్తల్లో నిలిచింది. పాడుతా తీయగా.. సింగర్‌ ప్రవస్తి ఆరోపణల తర్వాత ఓ మీడియా ఛానల్‌ తన అల్భమ్‌ రిలీజ్‌ సందర్భంగా సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి కలిసిన వీడియో లైఫ్‌లో చూపించారు.

 

ఇది సరైనది కాదంటూ హారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్‌ చేసింది. దీంతో అసలేం జరిగిందని అంతా ఆరా తీయగా అందరికి షాకిచ్చే అంశం తెరపైకి వచ్చింది. హారికా నారాయణ్‌ గతేడాది మార్చి 17న వివాహం చేసుకుంది. తన చీరకాల మిత్రుడు పృథ్వీనాథ్ వెంపటితో ఏడు అడుగులు వేసింది. అంతకు ముందే సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని అనంతరం ఫోటోలు షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. ఆ తర్వాత వారం రోజులకే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు హారిక తన భర్తతో దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్‌ చేస్తున్న వీడియోలు, ఫోటోలు.

 

అంతేకాదు ఈ అకౌంట్‌ నుంచి ఎంగేజ్‌మెంట్‌తో పాటు పెళ్లి సంబంధించిన ఫోటోలు, పోస్ట్స్‌ ఏం కనిపించడం లేదు. అంతేకాదు తన భర్తకు సంబంధించిన గతంలో షేర్‌ చేసిన పోస్ట్స్‌ కూడా కనిపించడం లేదు. అంటే తన భర్త పృథ్వీనాథ్ వెంపటికి సంబంధించిన పోస్ట్స్‌ అని ఆమె డిలీట్‌ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పృథ్వీనాథ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వారి పెళ్లి, నిశ్చితార్థానికి సంబంధించిన పోస్ట్స్‌ కూడా కనిపించడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందనేది ఇప్పుడ సస్పెన్స్‌ నెలకొంది. పెళ్లయి ఏడాదికే హారికా విడాకుల దిశగా ఆలోచనల చేస్తుందా? అని అంత సందేహిస్తున్నారు. మరి ఏ కారణంతో పెళ్లి, నిశ్చితార్థం ఫోటోలు, పోస్ట్స్‌ డిలీట్‌ చేసిందో తెలియదు.

 

కానీ, ప్రస్తుతం ఆమె విడాకులు దిశగా నిర్ణయం తీసుకుందా? అని నెటిజన్స్‌ సందేహిస్తున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు మాత్రం ఫాలో అవుతున్నారు. కాగా ఏడేళ్ల రిలేషన్‌ అనంతరం తాము పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నామని ఎంగేజ్‌మెంట్ ప్రకటన టైంలో హారిక పేర్కొంది. కాగా ఈ మధ్య సెలబ్రిటీలు విడాకులకు ముందు తమ పార్ట్‌నర్‌కి సంబంధించిన ఫోటోలు, పోస్ట్స్‌ని డిలీట్‌ చేసి వారి మెమోరీస్‌ని తుడిచిపెడుతున్నారు. సమంత-నాగ చైతన్యతో మొదలైన ఈ ట్రెండ్‌ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సౌత్‌ నుంచి బాలీవుడ్‌ వరకు సెలబ్రిటీలంత ఇదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు హారికా కూడా వారి బాటలోనే వెళ్తుందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Harika Narayan (@harika_narayan)

ఇవి కూడా చదవండి: