Published On:

Peddi Movie: పెద్ది మొదటి హీరో అతనే.. కుండబద్దలు కొట్టేసిన బుచ్చి

Peddi Movie: పెద్ది మొదటి హీరో అతనే.. కుండబద్దలు కొట్టేసిన బుచ్చి

Peddi Movie:ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే దానివెనుక చాలా కసరత్తు ఉంటుంది. కొన్నిసార్లు ఆ కథ వేరేవాళ్లకు వెళ్తుంది. మొదట అనుకున్న హీరో మారొచ్చు. కథలో మార్పులు జరగొచ్చు. ఇలా సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎవరు హీరో అని చెప్పడం కష్టం. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సినిమాలను చాలామంది హీరోలు రిజెక్ట్ చేసినవే అంటే అతిశయోక్తి లేదు.

 

ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం కూడా మొదట ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథనే అని వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నిజంగా నెటిజన్స్ అలా అనుకోవడానికి కారణం ఉంది. సుకుమార్ శిష్యుడుగా ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు సానా డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

 

ఈ సినిమా తరువాత బుచ్చి.. ఏ హీరోతో సినిమా చేస్తాడా అని అభిమానులు అందరూ ఎంతో ఎదురుచూశారు. ఇక ఉప్పెన తరువాత బుచ్చి.. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ కథ లైన్ మొదట ఎన్టీఆర్ కి నచ్చడంతో.. దాని మీద వర్క్ చేయమని చెప్పడంతో మొత్తం కథను ఫినిష్ చేసి.. ఎన్టీఆర్ కు వినిపించగా అది ఆయనకు నచ్చలేదని సమాచారం. అదే కథను రామ్ చరణ్ కి వినిపించడంతో ఆయన వెంటనే ఓకే చేశాడని వార్తలు వచ్చాయి.

 

పెద్ది గ్లింప్స్ రిలీజ్ అయ్యాక.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెదవి విరిచారు. అయితే తాజాగా ఈ విషయమై బుచ్చి నోరు విప్పాడు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. ” మొదట ఈ కథను మా గురువు సుకుమార్ కు వినిపించాను. ఆయన వెంటనే రామ్ చరణ్ కు చెప్పు అన్నారు. అప్పుడే ఈ సినిమాకు చరణ్ అని ఫిక్స్ అయ్యా” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో ఈ కథ ఫ్రెష్ అని క్లారిటీ వచ్చింది. తారక్ కు వినిపించిన కథ వేరు అని, చరణ్ పెద్ది కథ వేరు అని కుండబద్దలు కొట్టేశాడు. ఇక ఈ క్లారిటీతో చరణ్ అభిమానులు, తారక్ అభిమానులు సైలెంట్ అవుతారో.. లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి: