Published On:

Operation Karreguttalu: హైటెన్షన్​..తెలంగాణ సరిహద్దులో కాల్పుల మోత

Operation Karreguttalu: హైటెన్షన్​..తెలంగాణ సరిహద్దులో కాల్పుల మోత

CRPF Big Operation Against Maoist in Karreguttalu: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి కాల్పుల మోత జరిగింది. తెలంగాణ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల మోతకు భయపడి కర్రెగుట్ట వైపు మావోయిస్టులు పారిపోయారు. కాగా, ఇప్పటికే పారా మిలిటరీ బలగాలు వేలసంఖ్యలో ఛత్తీస్‌గఢ్ చేరుకున్నాయి. అయితే శాంతి చర్చలు అంటూనే ఎన్ కౌంటర్లు చేయడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటించాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

 

ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టాయి. బచావో కర్రెగుట్టలు పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. కర్రెగుట్టల చుట్టూ దాదాపు 2వేల మందికి పైగా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అయితే, ఈ ప్రాంతంలో మావోయిస్టులు పేలుడు పదార్థాలు అమర్చడంతో హైటెన్షన్ నెలకొంది.

 

అయితే, ఈ అడవుల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా దళం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే 2వేల మందితో కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నారు. కాగా, ఈ ఆపరేషన్ సోమవారం అర్ధరాత్రి నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.