Published On:

Saif Ali Khan: రక్షణ భయం – ఆ దేశంలో ఇల్లు కొన్న సైఫ్‌ అలీఖాన్‌.. త్వరలోనే కుటుంబమంతో సహా మకాం

Saif Ali Khan: రక్షణ భయం – ఆ దేశంలో ఇల్లు కొన్న సైఫ్‌ అలీఖాన్‌.. త్వరలోనే కుటుంబమంతో సహా మకాం

Saif Ali Khan buys luxurious house in Qatar: బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విదేశాల్లో ఇల్లు కొన్నాడు. త్వరలోనే కుటుంబంతో కలిసి అక్కడికి షిఫ్ట్‌ అవ్వాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇటీవల ఓ దుండగుడు సైఫ్‌పై దాడి చేసిన తర్వాత ఆయన ఖతర్‌లో ఇల్లు కోనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సైఫ్‌ తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు దీనిపై ప్రశ్న ఎదురైంది.

 

“అది నా హాలీడే హోమ్‌. ఖతర్‌ అందమైన, విలాసవంతమైన దేశం. అక్కడ ఉన్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రాంతం నాకు చాలా సురక్షితంగా అనిపించింది. అందుకే అక్కడ ఇల్లు కొనడానికి కారణమైంది. ఇక నా ప్రయాణాకి కూడా అది సులవైన ప్రాంతం. అక్కడ ఉన్నన్ని రోజులు నా ఆహారం, జీవినశైళి అన్నీ మారిపోతాయి. అక్కడ ఒక ఇంటికి, మరో ఇంటికి దూరంగా ఉంటుంది.

 

ఇటీవల షూటింగ్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది.అక్కడి వాతావరణం కూడా అద్బుతంగా అనిపించింది. దీంతో అక్కడ ఇల్లు కొన్నాను. కుటుంబాన్ని అక్కడి షిఫ్ట్‌ చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నా” అని చెప్పుకొచ్చారు. కాగా గత జనవరిలో సైప్‌ అలీఖాన్‌పై ఓ దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. జనవరి 16న దొంగతనం కోసం సైఫ్‌ ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఆయన చిన్న కుమారుడు జేహ్‌ గదిలో దాక్కున్న అతడిని కేర్‌ టేకర్‌ గమనించిన అరిచింది.

 

ఆ అరుపులకు బయటకు వచ్చిన సైఫ్‌ దుండగుడిని పట్టుకుని బంధించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ దుండగుడు తన చేతిలో ఉన్న కత్తితో సైఫ్‌కి దాడి చేశాడు. ఈ ఘటన సైఫ్‌ శరీరంపై ఆరు స్థానాల్లో కత్తిపోట్లు తగిలాయి. ఇక సైఫ్‌ వెన్నుముకలో కొత్తి కొన భాగం విరిగి ఉంది. రక్తం మోడుతున్న గాయాలతో తన కొడుకు తైమూర్‌, కేర్‌ టేకర్‌ సాయంతో సైఫ్‌ స్వయంగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఐదు రోజులు చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఆ గాయాల నుంచి కోలుకున్న ఆయన ఇప్పుడిప్పుడే షూటింగ్‌లో పాల్గొంటున్నారు.