Home / Hydra
HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందంతో కలిసి హైదరాబాద్‌లోని బాలానగర్‌లో పర్యటించారు. వినాయకనగర్ కాలనీలోని గడ్డి చేను స్థలాన్ని అనుకుని ఉన్న నాలాను పరిశీలించి, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం కళ్యాణ్ నగర్ వద్ద ఉన్న నాలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. నాలా ఉన్న ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామని రంగనాథ్ చెప్పారు. నాలాకు వెళ్లే దారిలో ఓ వ్యక్తి గేటుకు తాళం వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్. తక్షణమే తాలంను […]
Hydra Emergency Services: హైదరాబాద్ నగర ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించింది. వాటర్ లాగింగ్ పాయింట్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందుకు గానూ హైడ్రా 150 ఎమర్జెన్సీ బృందాలు, 51 DRF టీమ్‌లు, చెత్త తొలగింపు సిబ్బంది, బైక్ బృందాలు, ట్రాఫిక్ సహా మొత్తం 4100 మంది సిబ్బందితో రంగం సిద్ధం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ 24 గంటలూ అన్ని బృందాలు అప్రమత్తంగా ఉండాలని […]
BreakingNews: ఓ పార్కును కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన 3గంటల్లోనే సమస్యకు హైడ్రా పరిష్కారం చూపింది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్లలోని రుక్కిణి ఎస్టేట్‌కు చెందిన ఓ పార్కును కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. ఈ కబ్జాలు తొలగించాలని రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌కు ఫోన్ చేసి ఆక్రమణలు తొలగించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మధ్యాహ్నం ఫిర్యాదు […]
Hydra Demolish: అక్రమ కట్టడాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే నాళాలను ఆక్రమించి భవనాలు నిర్మించారని.. హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు వాటిని పరిశీలించి కూల్చివేతలు చేపట్టారు. అక్రమాలు ఎంతమేర చేపట్టారో గమనించి జేసీబీలతో వాటిని కూల్చివేస్తున్నారు. కాగా ఇవాళ బేగంపేట, ప్యాట్నీ ఏరియాల్లోని నాళాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. కంటోన్మెంట్ ఏరియాలో తొలిసారిగా అక్రమ కట్టాడాలు కూల్చివేయడం గమనార్హం. కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి హైడ్రా […]
Hydra Demolishes Illegal Constructions In Hyderabad: హైదరాబాద్‌లో హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేతలో మళ్లీ వేగం పెంచింది. తాజాగా, మియాపూర్, మణికొండ, హైదర్ నగర్ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేతలు షురూ చేశారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం హైదర్ నగర్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్లో అక్రమంగా నిర్మించిన కొన్ని షెడ్లను కూల్చివేశారు. కొంతమంది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను అక్రమంగా ఆక్రమించడంతో పాటు షెడ్లను ఏర్పాటు చేశారు. […]
HYDRA and GHMC Sensational Decision for Protection: హైడ్రా, జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముప్పు తదతర సమస్యల నివారణపై హైడ్రా, జీహెచ్ఎంసీ స్పెషల ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే అగ్ని ప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు. కాగా, జీహెచ్ఎంసీ […]
Hydralakes Free Mobile App Introduced in Hyderabad: హైదరాబాద్ నగరంలో లేక్ బఫర్ జోన్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలపై శాశ్వత చర్యలు చేపడుతోంది. అయితే, ఇటీవల చాలా కుటుంబాలు బఫర్ జోన్ల పరిధిలో ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎంతోమంది కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇంటి నిర్మాణానికి ఖర్చు పెట్టగా.. చివరికి ఆ ఇంటి నిర్మాణాలు లేక్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ చెప్పడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘హైడ్రాలేక్స్’ పేరిట […]