Actress Abhinaya Reception Photos: నటి అభినయ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్.. రాయల్ లుక్‌లో ఆకట్టుకున్న కొత్త జంట, ఫోటోలు చూశారా?

Actress Abhinaya Grand Wedding Reception Photos: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫేం నటి అభినయ ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే

తన చీరకాల మిత్రుడు, ప్రియుడు హైదరాబాద్ చెందిన సన్నీ వర్మ (వేగేశ్ కార్తీక్)తో ఏప్రిల్ 16న ఏడడుగులు వేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది

ఎంతోకాలంగా రిలేషన్లో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వడంతో అభినయ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తర్వాత సన్నిహితులు, బంధువులు, ఇండస్ట్రీలోని వారి కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు

ఇందుకు సంబంధించిన ఫోటోలు అభినయ తాజాగా షేర్ చేసింది, ఇందులో వీరిద్దరు మ్యాచిక్ కలర్ డ్రెస్‌లతో రాయల్ లుక్‌లో కనిపించి కనువిందు చేశారు

ఈ కొత్త జంటను ఇలా మేడ్ ఫర్ ఈజ్ అదర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు, హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా రవితేజ నేనింత చిత్రంతో అభినయ నటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది

అప్పటి వరకు హీరోలకు చెల్లెలిగా, సహాయ నటిగా కనిపించిన అభినయ.. సమంత 'రాజుగారి గది 2' సినిమాలో నెగిటివ్ షేడ్‌లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.