Priyanka Chopra: మహేష్- రాజమౌళి హీరోయిన్ హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూశారా?

Priyanka Chopra’s Heads of State Movie Trailer: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న SSMB29 లో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఇందులో ప్రియాంక హీరోయిన్ గా చేస్తుందని కొందరు అంటుండగా.. మరికొందరు విలన్ గర్ల్ ఫ్రెండ్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుందని చెప్పుకొస్తున్నారు.
ఇక SSMB 29 తరువాత ప్రియాంక చోప్రా ఏది చేసినా అది సెన్సేషన్ గా మారుతుంది. తాజాగా ఆమె నటించిన హాలీవుడ్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. హాలీవుడ్ హీరో ఇద్రిస్ ఎల్బా, జాన్ సీనా, ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న చిత్రం హెడ్స్ ఆఫ్ స్టేట్. ఇదొక కామెడీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 2 న రిలీజ్ కానుంది. అయితే థియేటర్ లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అన్ని భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఇక తాజాగా హెడ్స్ ఆఫ్ స్టేట్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను బట్టి ఇద్రిస్ ఎల్బా యూకే ప్రైమ్ మినిష్టర్ గా కనిపించగా.. జాన్ సీనా అమెరికా అధ్యక్షుడుగా కనిపించాడు. ఇక ప్రియాంక MI6 ఏజెంట్ గా కనిపించనుంది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫుల్ గా నవ్వుకోవడానికి కామెడీ కూడా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది.
ప్రియాంక.. SSMB29 లో నటించడంతో.. తెలుగు ప్రేక్షకులు సైతం హెడ్స్ ఆఫ్ స్టేట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ప్రియాంక.. అమెరికా పాప్ సింగర్ అయిన నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికా కోడలిగా మారింది. అక్కడకు వెళ్ళాక హాలీవుడ్ సినిమాల్లోనే నటించడానికి మొగ్గు చూపింది. అలా చేసిందే సిటాడెల్ కూడా. కానీ, హాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చుకున్నంతగా సిటాడెల్ ను తెలుగువారు మెచ్చుకోలేకపోయారు. మరి ఇప్పుడు ఈ హాలీవుడ్ సినిమాతోనైనా ప్రియాంక తెలుగువారిని మెప్పిస్తుందేమో చూడాలి.