Natural Star Nani: పవన్ ఫినిష్ చేస్తేనే.. నాని స్టార్ట్ చేస్తాడట..

Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మే 1 న రిలీజ్ కానుంది. ఇప్పటివరకు క్లాస్ హీరోగా, పక్కింటి అబ్బాయిలా ఉన్న నాని.. ఎలాగైనా ఈసారి మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లో అంత వైలెంట్ ను చూపించడంతో ఈసారి నాని అనుకున్నది సాధించేలా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని టాక్ నడుస్తోంది. ఇక ప్రమోషన్స్ కూడా ఎంత డిఫరెంట్ గా చేయాలో అంతా చేస్తున్నారు. నాని యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు నాని. ఇక హిట్ 3 తర్వాత ఈ కుర్ర హీరో చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఇప్పటికే సెట్స్ మీద ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఒక చిన్న గ్లింప్స్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది.
ఇక ప్యారడైజ్ తరువాత నాని.. సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. Dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వాలి అంటే పవన్ సినిమా సినిమా ఫినిష్ అవ్వాలి అని నాని అంటున్నాడు. అదేంటి పవన్ కు, నానికి సంబంధం ఏంటి అంటే.. ప్రస్తుతం సుజిత్, పవన్ కళ్యాణ్ తో OG సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా అడపదడపా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయితే కానీ, సుజిత్ మరో సినిమాను మొదలుపెట్టడు.
ఇదే విషయం గురించి నాని మాట్లాడుతూ” ప్రస్తుతం సుజీత్.. OG సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అయితే కానీ, మా సినిమా పట్టాలెక్కదు. పవన్ డేట్స్ దొరకాలి, ఆ సినిమా ఫినిష్ చేయాలి. అప్పుడు మొదలవుతుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పవన్ ఫినిష్ చేసేది ఎప్పుడో…నాని స్టార్ట్ చేసేది ఎప్పుడో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.