Home /Author Guruvendhar Reddy
Complaint Against Prabhas, Balakrishna and Gopichand in Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు మరో ముగ్గురు స్టార్ హీరోల మెడలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్‌లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది స్టార్ […]
Supreme Court Once Again Notices to Telangana Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఆయనకు కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్‌పై ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆయనకు తొలుత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు ఆయన స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు […]
Centre withdraws 20% duty on Onion Export: ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి ఎగుమతులపై ఉన్న 20 శాతం సుంకం రద్దు చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వులు విడుదలయ్యాయి. కాగా, దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడుతుందనే ముందుచూపుతో కేంద్ర 2023లో ఉల్లి ఎగుమతిని నిషేధించింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఉల్లిపై ఉన్న ఎగుమతిని ఎత్తివేసింది. […]
Chase Master Virat Kohli Breaks Records in IPL: ఐపీఎల్ 2025ను ఆర్సీబీ విజయంతో ప్రారంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 36 బంతుల్లో 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌లో కోల్‌కతాపై 1000 పరుగులు […]
Hamas Political Leader and his Wife Killed In Israeli Airstrike In Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. గత కొంతకాలంగా హమాస్ సంస్థకు చెందిన రాజకీయ కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది. తాజాగా, గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కీలక రాజకీయ నేత సలాహ్ అల్ బర్దావీల్ మృతి చెందినట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో మరణించినట్లు హమాస్ వెల్లడించింది. ఈ దాడుల్లో మిలిటెంట్ […]
ACB Case Filed Against YCP Former Minister Vidadala Rajini: వైసీపీ మాజీ మంత్రి విడుదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2020 సెప్టెంబర్‌లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్‌పై విజిలెన్స్ తనిఖీలంటూ దాదాపు రూ.2కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేసినట్లు అభియోగంపై విడుదల రజినిపై కేసు నమోదైంది. ఆమెతో పాటు అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరికొంతమందిపై ఏసీబీ కేసు నమోదు […]
Mass Shooting at USA New Mexico park 3 Dead: అమెరికాలో మరోసారి కాల్పుల మోత రేగింది. న్యూ మెక్సికోలో జరిగిన ఓ కారు ప్రదర్శనలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ కాస్త పెద్దదిగా మారడంతో పరస్పరం రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. ఈ కాల్పులతో కారు ప్రదర్శనకు చూసేందుకు వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. […]
IPL 2025 Today Two Matches SRH VS RR, MI VS CSK: ఐపీఎల్ 2025లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఇక, ఉప్పల్ స్టేడియంలో […]
RCB WON THE MATCH IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైటరైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్‌కతా నైటరైడర్స్ బ్యాటర్లలో రహానె(56), సునీల్ నరైన్(44), రఘువంశీ(30) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య […]
Jobs Notifications in telangana revenue department: నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఈ నియామకాలు చేపట్టనున్నారు. కాగా, […]