Fahadh Faasil in Jailer 2: జైలర్ 2 లో పుష్ప విలన్.. రజినీతో రెండోసారి ?

Fahadh Faasil as Villain in Rajinikanth movie Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ గురించి చెప్పాలంటే జైలర్ కు ముందు.. జైలర్ తరువాత అని చెప్పాలి. రజినీ కెరీర్ ముగిసిపోతుంది అనుకొనే సమయంలో జైలర్ రిలీజ్ అయ్యింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రజినీ పని అయిపోయింది అనుకున్నవారికి అతని సత్తా ఏంటి అనేది మరోసారి రుజువు చేసిన సినిమా జైలర్.
నెల్సన్ టేకింగ్, రజినీ స్టైల్, అనిరుధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బీస్ట్ లాంటి పరాజయం తరువాత నెల్సన్ తో సినిమా చేయొద్దని ఫ్యాన్స్ రజినీనీ వేడుకున్నారు. కానీ, ఇచ్చిన మాట కోసం.. నెల్సన్ ను నమ్మి జైలర్ లో నటించాడు. ఆ సినిమానే రజినీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఈ మధ్యనే జైలర్ 2 రాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం రజినీ నటిస్తున్న కూలీ సినిమాను ఫినిష్ చేసి.. జైలర్ 2 సెట్ లో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో కూడా స్టార్ క్యాస్టింగ్ ను దింపుతున్నాడు నెల్సన్. పార్ట్ 1 లో కనిపించిన శివన్న.. పార్ట్ 2 లో కూడా కంటిన్యూ కానున్నాడు. శివన్న తో పాటు మరో స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా జైలర్ 2 లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రజినీ నటించిన వెట్టాయన్ లో ఫహాద్ కీలక పాత్రలో నటించిన సంగతి తెల్సిందే. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో ఫహాద్ పాత్రకే ఎక్కువ మార్కులు పడ్డాయి.
ఇక ఇప్పుడు జైలర్ 2 లో కూడా ఫహాద్ కి మంచి పాత్ర పడిందని టాక్ నడుస్తోంది. కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించే ఫహాద్.. జైలర్ 2 లో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం కేరళలో జరుగుతున్న షూటింగ్ లో రజనీతో పాటు ఫహాద్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడట. ఇక ఈ టాలెంటెడ్ హీరో కూడా జైలర్ 2 లో ఉన్నాడని తెలియడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- Ananya Nagalla Pays Tribute: ‘మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను’.. అనన్య ఎమోషనల్