Published On:

Mass Jathara First Song Out: మరణించిన సింగర్‌ చక్రీ వాయిస్ రీక్రియేషన్.. రవితేజ ‘మాస్‌ జాతర’ ఫస్ట్‌ సాంగ్‌!

Mass Jathara First Song Out: మరణించిన సింగర్‌ చక్రీ వాయిస్ రీక్రియేషన్.. రవితేజ ‘మాస్‌ జాతర’ ఫస్ట్‌ సాంగ్‌!

Hero Ravi Teja’s Mass Jathara ‘Tu Mera Love’ Lyrical Song Out: మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘మాస్‌ జాతర’. హిట్స్‌ ప్లాప్స్‌తో సంబంధం లేకుండ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ మాస్‌ హీరో. ఈ క్రమంలో కొత్త దర్శకుడు భాను భోగవరపుతో చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకుంటుంది ఈ సినిమా. త్వరలోనే మాస్‌ జాతరను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

 

ఈ క్రమంలో మూవీ ప్రమోషనల్‌ కార్యక్రమాలను కూడా షూరు చేసింది టీం. ఇందులో భాగంగా తాజాగా మాస్‌ జాతర నుంచి ఫస్ట్‌ సాంగ్‌ని విడుదల చేసింది మూవీ టీం. ‘తూ మేరా లవర్‌’ అంటూ సాగే ఈ పాటు తాజాగా రిలీజ్‌ చేశారు. ఇందులో రవితేజ తన బ్లాక్‌బస్టర్‌ మూవీ ఇడియట్‌లోని హిట్‌ సాంగ్‌ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటలోనే ఐకానిక్‌ స్టెప్పులతో పాటు మ్యూజిక్‌ని కూడా రీక్రెట్‌ చేశారు. అంతేకాదు దివంగత మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌ చక్రీ వాయిస్‌ని ఏఐతో కంపోజ్‌ చేసి ఈ పాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ వయసులో కూడా మాస్‌ మహారాజ్‌ తన ఎనర్జీతో సర్‌ప్రైజ్‌ చేశాడు. అదే జోరు, అదే జోష్‌ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. ఇక శ్రీలీల కూడా తన మరింత గ్రేస్‌తో డ్యాన్స్‌ స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.