Allu Arjun-Vijay Devarakonda: మరోసారి అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ గిఫ్ట్ – అదేంటో తెలుసా?

Allu Arjun Received Gift From Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. బన్నీకి, తన పిల్లలకు గిఫ్ట్స్ పంపించాడు. దీంతో విజయ్‌కి థ్యాంక్యూ చెబుతూ బన్నీ సోషల్ మీడియో పోస్ట్ షేర్ చేశాడు. కాగా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లు మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే.
సందర్భం వచ్చినప్పుడల్లా వీరిద్దరి ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటారు. వారి వారి సినిమా ఈవెంట్స్‌లో స్పెషల్ గెస్ట్స్‌గా వెళ్లి సపోర్టుగా ఉంటారు. అల్లు అర్జున్‌ని విజయ్ బన్నీ అన్న అంటూ పిలుచుకుంటాడు. అయితే తరచూ రౌడీ హీరో బన్నీ కానుకలు పంపిస్తున్న తన ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటుంటాడు. పుష్ప 2 రిలీజ్ సందంగా అల్లు అర్జున్‌కి తన సొంత బ్రాండ్ రౌడీ స్టోర్ నుంచి స్పెషల్‌గా డిజైన్ చేయించిన టి-షర్ట్స్ పంపి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా మరోసారి సరికొత్త స్టైలిష్ బ్రాండ్ టి-షర్ట్‌ని పంపి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.అంతేకాదు బన్నీ పిల్లలకు బర్గర్, చాక్లెట్స్ కూడా పంపించాడు.
విజయ్ పంపించిన కానుకలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. “మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ ఏవోక క బహుమతులు పంపిస్తూన ఉంటాడు. సో స్వీట్” అంటూ బన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. అయితే ఈ గిఫ్ట్స్ పంపించడానికి కారణమేంటంటే.. విజయ్ తన ‘రౌడీ’ బ్రాండ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ సందర్భంగా దానిని సెలబ్రేట్ చేసుకుంటూ అల్లు అర్జున్ మరోసారి టీ-షర్ట్స్ పిల్లలకు స్వీట్స్, చాక్లెట్స్ పంపించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్ మూవీతో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో విజయ్ జవాన్‌గా కనిపించనున్నాడు. జెర్సీ లాంటి హిట్ తర్వాత గౌతమ్ తిన్ననూరి నుంచి వస్తున్న ఈచిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. లైగర్, ఖుషి వంటి వరుస ప్లాప్స్ తర్వాత విజయ్ ఈ చిత్రంలో గట్టి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల విడుదలైన కింగ్‌డమ్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. చూస్తుంటే ఈసారి విజయ్ ఖాతాలో భారీ హిట్ ఖాయం అనెట్టుందంటున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి:
- Kiran Abbavaram KA Movie: కిరణ్ అబ్బవరం సినిమాకు అరుదైన గౌరవం – ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ క నామినేట్