Published On:

India-Pakistan Jhelum River: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఒక్కసారిగా గేట్లను ఎత్తేసిన భారత్

India-Pakistan Jhelum River: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఒక్కసారిగా గేట్లను ఎత్తేసిన భారత్

India Releases Water into River Jhelum: పహల్గామ్ ఉగ్రదాడిలో 28 పర్యాటకులు చనిపోయారు. ఈ దాడి నేపథ్యంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే వీసాల రద్దు, సింధు నది నీళ్ల ఒప్పందం రద్దు చేసి పాకిస్థాన్‌ను దెబ్బ తీసింది. తాజాగా, పాకిస్థాన్‌ను మరో దెబ్బ కొట్టింది. పాకిస్థాన్‌ దేశానికి ఎలాంటి ముందస్తు ఇన్‌ఫర్మేషన్ లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జీలం నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లను ఒక్కసారిగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసింది.

 

జీలం నది నుంచి నీళ్లు ఒక్కసారిగా రావడంతో పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్ సమీప పరిసరాల్లో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఉన్న స్థానిక అధికారులు హిట్టియన్ బాలాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అంతేకాకుండా పలు మసీదుల్లో ప్రకటనలతో స్థానిక ప్రజలను హెచ్చరించారు. కాగా, నదీ జలాలు ఒక్కసారిగా పెరగడంతో నదీ తీరాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

 

కాగా, పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్, చకోటి ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి. ఇప్పటికే అనేకమంది పాకిస్థానీయులు వరదల్లో చిక్కుకున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు సమాచారం లేకుండా భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ తీవ్రంగా షాక్‌కు గురైంది. మరోవైపు, సింధు నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లను భారత్ ఇప్పటికే మూసివేసింది. ఈ గేట్లను మూసివేయడంతో పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది.