Samantha: అతనితో బంధం ప్రత్యేకం – దానికి పేరు పెట్టలేను: సమంత

Samantha About Her Relationship With Rahul Ravindran: స్టార్ హీరోయిన్ సమంత గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకుంది. కోలీవుడ్‌లో నిర్వహించిన ఈ అవార్డు కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ పురస్కారాల్లో సమంత గోల్డెన్ క్వీన్‌గా అవార్డు తీసుకుంది. అనంతరం సమంత స్టేజ్‌పై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక్క విషయంలోనే కెరీర్‌ని నిర్ణయించలేమని సమంత అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ స్టేజ్‌పై పంచుకున్నారు.కాగా సమంతకు సింగర్ చిన్మయి, రాహుల్ మంచి సన్నిహితులు అనే విషయం తెలిసిందే. ప్రతి విషయంలో ఆమెకు వీరు అండగా ఉంటారు. ఆమె అనారోగ్యం బారిన పడినప్పుడు రాహుల్ తన వెంటే ఉన్నాడని, ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడంటూ ఎమోషనల్ అయ్యింది. “ఈ సందర్భంగా మీ అందరితో ఒక విషయాన్ని పంచుకోవాలి. నా జీవితంలో రాహుల్‌కి ఎలాంటి స్థానం ఉందో చెప్పాలి. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్ నా వెంటే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. నా స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్తసంబంధీకుడా ఏమని చెప్పలేను. మా అనుబంధం ఇది దానికో పేరు పెట్టలేను. నా జీవితంలో ఎప్పటికీ తనో ప్రత్యేకం” అంటూ సామ్ చెప్పుకొచ్చింది.
అనంతరం తన ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ మాట్లాడింది. “ఇంతమంది అభిమానాన్ని పొందడం నా అదృష్టం. లక్‌తో పాటు నేను పడిన కష్టమే.. ఈ రోజు నాకు ఇంతమంది అభిమాన్ని తెచ్చిపెట్టింది. దీనిని నేను దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. అయితే మనం తీసుకునే ఒక్క నిర్ణయంతో కెరీర్ ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా డిసైడ్ చేస్తే అది అబద్ధమే అవుతుంది. తెలిసి, తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్‌పై ప్రభావం చూపుతాయి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి:
- The Raja Saab: హై అలర్ట్.. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్‌పై హింట్ ఇచ్చిన డైరెక్టర్ – మండిపడుతున్న నెటిజన్స్