Anchor Rashmi: వారం కిత్రం ఆస్పత్రి బెడ్‌పై.. ఇప్పుడు వెకేషన్‌లో – యాంకర్ రష్మీపై నెటిజన్స్ ఆగ్రహం!

Anchor Rashmi Shared her Vacation Photos: యాంకర్ రష్మీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవల తీవ్ర రక్తస్రావం, భుజం నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. షోల్డర్ పెయిన్‌కి శస్త్ర చికిత్స తీసుకున్నట్టు రష్మీ తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు షేర్ చేసింది. దీంతో అభిమానులంత ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ పోస్ట్ పెట్టి వారం తిరక్కుండానే రష్మి మరో పోస్ట్ పెట్టింది.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా రష్మీ బాలి పర్యటనకు వెళ్లింది. అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ తన పుట్టిన రోజు వేడుకలో భాగంగా వెకేషన్‌కు వచ్చినట్టు చెప్పింది. “రెండు నెలల క్రితమే ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. నా ప్రతి పుట్టిన రోజును ఏదైన కొత్త ప్రదేశంలో జరుపుకోవడం ఇష్టం. అందుకే బాలికి వచ్చాను. మన సంస్క్రతికి, సంప్రాదాయాలకు ఈ దేశం చాలా చేరువగా ఉంటుంది. అందుకే బాలి అంటే నాకు ఇష్టం. రేపు నా పుట్టిన రోజు. విష్ చేయడం మరిచిపోకండి” అని రాసుకొచ్చింది.
రెండు నెలల క్రితమే ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. ఈ వెకేషన్ అంతా ఆటపాటలతో ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నాం. కానీ, తీర చూస్తే తినడం,పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం.. వీటితోనే సరిపోతుంది. ఇంతకుముందేన్నడు వెకేషన్స్ ఇలా జరగలేదు. బహుశా మన జీవితంలో అన్ని తెలుసుకునేందుకు దేవుడు ఇలా చేస్తాడేమో. ప్రస్తుతం బాలీలో నా ఫ్రెండ్స్‌తో సేద తీరుతున్నా” అని పేర్కొంది. అయితే రష్మీ పోస్ట్‌పై కొందరు నెటిజన్స్ భగ్గుమంటున్నారు. దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే నీకు వెకేషన్ కావాలా? పహల్గాం ఉగ్రదాడితో భారత్ దేశం యావత్తు విషాదంలో ఉంది.. కానీ నువ్వు మాత్రం వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నావా? అని ప్రశ్నించాడు ఓ నెటిజన్. దీనికి రష్మి స్పందిస్తూ.. ఇది రెండు నెలల క్రితం ప్లాన్ చేసిన ట్రిప్ అని స్పష్టం చేసింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Actor Babloo Prithiveeraj: ఈవెంట్‌కి పిలిచి అవమానించారు – ‘యానిమల్’ తర్వాత పెద్ద స్టార్ అయ్యాననుకున్నా, కానీ..