Published On:

Kaliyugam 2064: ‘కల్కి’ రేంజ్‌లో ‘కలియుగమ్‌-2064’ ట్రైలర్‌.. నీరు, ఆహారం కోసం మనుషులు ఎలా కొట్టుకుంటున్నారో చూశారా?

Kaliyugam 2064: ‘కల్కి’ రేంజ్‌లో ‘కలియుగమ్‌-2064’ ట్రైలర్‌.. నీరు, ఆహారం కోసం మనుషులు ఎలా కొట్టుకుంటున్నారో చూశారా?

Kaliyugam 2064 Telugu Official Trailer: హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌, నటుడు కిషోర్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘కలియుగమ్‌-2064’. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ని వేగం చేసింది మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. కలియుగంలో ప్రపంచంలోని మనుషులు ఎలా ఉంటారు, వారి జీవనం ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది.

 

ఎప్పుడు ప్రపంచం అంతమవుతుందో.. అప్పుడు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. ఆహారం, నీరు కూడా దొరకదు. అదే 2064 (When The World Ran Out Of.. Food, Water and Humanity) అంటూ ఇంగ్లీష్‌లో టైటిల్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత “భయంతో ఆకలితో చద్దమా.. లేదంటే పోరాడి చద్దమా” అది మన చేతిల్లోనే ఉంది అని బ్యాగ్రౌండ్‌ వాయిస్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఆకలితో మనుషులు ఒకరినోకరు చంపుకోవడం.. జీవనం.. ఆహారం, నీరు కోసం మనుషులు కోట్టికొని చావడం వంటి అంశాలతో ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది.

 

కల్కికి వీరిక ఏవిధమైన సంబంధం లేదు అంటూ హీరోయిన్‌ వెడుకోవడం ఇలా క్షణం క్షణం ఉత్కంఠ, ఆసక్తితో ట్రైలర్‌ సాగుతూ ఆసక్తిని పెంచుతోంది. ఇక ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్స్‌.. ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కల్కి 2898 ఏడీ చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఈ ప్రస్తుతం కలియుగమ్-2064 ట్రైలర్‌ మూవీపై ఆసక్తిని పెంచుతోంది. కాగా ప్రమోద్‌ సుందర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆర్‌కే ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామకృష్ణ నిర్మించారు. మే 9న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.