United Nations: పహల్గామ్ ఉగ్రదాడి.. భారత్, పాక్‌లకు ఐక్యరాజ్యసమితి కీలక సూచన

United Nations Fecretary General Antonio Guterres Key Statements About India – Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య వాతావరణ వేడెక్కింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక ప్రజలు మృతి చెందారు. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టిగా బదులు ఇస్తుంది. ఇప్పటికే భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిపింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
అయితే, పహల్గామ్ టూరిస్టులపై జరిపిన ఉగ్రదాడిపై యావత్తు ప్రపంచం ఖండించింది. తాజాగా, ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. ఈ ఆందోళనకర పరిస్థితులను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిచెందిన పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించిందన్నారు. అమాయక ప్రజలపై దాడి చేసి చంపడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ గెటెర్రెస్ సైతం దీనిని పరిశీలించారు. ఈ విషయంలో భారత్, పాక్ సంయమనం పాటించాలన్నారు. అంతేకాకుండా ఇరు దేశాలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామన్నారు.