Published On:

Pahalgam: పందులకు, పాకిస్థానీలకు అనుమతి లేదట

Pahalgam: పందులకు, పాకిస్థానీలకు అనుమతి లేదట

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసరనలు వ్యక్తమవుతున్నాయి. మతంపేరిట మారణహోమం సృష్టించిన వారిని, వెనకుండి నడిపించిన పాకిస్థాన్ పై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్ లోని ఓ షాపు యజమాని అనూహ్యంగా నిరసనను వ్యక్తం చేశాడు. 56దుఖాన్ ( చెప్పన్ దుఖాన్) అనే ఫుడ్ బిజినెస్ చేస్తున్న యజమాని తన షాపు ముందు ఓ బోర్డును పెట్టాడు. అందులో పాక్ ఆర్మీ డ్రెస్ కు పంది ముఖాన్ని జతచేసి బోర్డును ఏర్పాటు చేశాడు. పందులకు, పాకిస్థానీలకు తన షాపులోకి ప్రవేశం లేదని  రాసి ఉంది.

 

 

షాపు యజమాని గుంజన్ శర్మ మీడియాతో మాట్లాడుతూ మతం పేరిట టూరిస్టులను చంపడం సిగ్గుచేట్టన్నారు. అందుకు కారణమైన పాకిస్థాన్ కు తగిన శాస్తి జరగాలన్నాడు. తాము పాకిస్థాన్ కు సందేశం పంపే ఉద్దేశంతోనే ఈ బోర్డును ఏర్పాటుచేశామన్నాడు. ఈ నాగరిక ప్రపంచంలో పాకిస్థాన్ లాంటి దేశానికి తావు లేదన్నాడు.

 

pigs and pakistani not allowed in food court poster comes up in indore madhya pradesh

pigs and pakistani not allowed in food court poster comes up in indore madhya pradesh

 

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిలో 26మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. పలువురు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి వెనకాల లష్కరే తయిబా ఉంది. ఇప్పటికే తాము ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి అంతర్జాతీయ మీడియా ముందు నోరుజారాడు. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించినంతకాలం సింధూ జలాలను ఆపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. తీవ్రవాదులు భూమిపై ఏ చివర దాక్కున్నా శిక్షించి తీరతామన్నారు ప్రధాని మోదీ.

 

 

పాక్ కవ్వింపు చర్యలు మాత్రం రెట్టింపు అవుతున్నాయి.  రెండు రోజులుగా  నియంత్రణ రేఖ వెంబడి కాల్పులను చేయసాగింది. భారత భద్రతా బలగాలు పాక్ కు ధీటుగా బదులిస్తున్నారు. సింధూ జలాలను భారత ప్రభుత్వం ఆపేసిన తర్వాత లష్కరే చీఫ్ హఫీజ్  మాట్లాడుతూ భారత ప్రధాని మోదీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.