Published On:

Kiara Advani: చెకప్స్ కోసం కోటి రూపాయల కారు.. ఏంటమ్మా కియారా ఇది

Kiara Advani: చెకప్స్ కోసం కోటి రూపాయల కారు.. ఏంటమ్మా కియారా ఇది

Kiara Advani: డబ్బు.. అది ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే. మరి లేకపోతే.. కేవలం చెకప్స్ కోసం కోటి రూపాయల కారు ఏంటి.. విడ్డూరం కాకపోతే. ప్రస్తుతం బాలీవుడ్ నెటిజన్స్ ఇలానే నోళ్లు నొక్కుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం తమ మొదటి బిడ్డ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కియారా ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం  తెల్సిందే. అయినా కూడా ఆమె అడపాదడపా ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి కనిపిస్తూనే ఉంది.

 

ఇక ప్రెగెన్సీ అంటే మాటలు కాదు కదా. నిత్యం హాస్పిటల్స్, చెకప్స్ ఇలా తిరుగుతూనే ఉండాలి. దాని కోసం సిద్దార్థ్.. కియారాకు ఒక లగ్జరీ కారును గిఫ్ట్ ఇచ్చాడట. ఈ మధ్యనే కియారా టొయాటో కంపెనీ చెందిన వెల్‌ఫైర్ అనే మోడ‌ల్ కు చెందిన విలాసవంతమైన కారులో చెకప్ కు వచ్చింది. అక్కడ ఆ కారును చూసి పాపారాజీస్ మొత్తం షాక్ అయ్యారట. ఎందుకంటే ఆ కారు విలువ అక్షరాలా రూ. 1.22 కోట్లు అంట. అమ్మ బాబోయ్ అంత కాస్ట్లీ కారునా..  అంటే అది కూడా కేవలం చెకప్స్ కోసం మాత్రమేనట.

ఈ కాస్ట్లీ  కారులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయట. లోపల ఎంతో విలాసవంతంగా ఉండడంతో పాటు ఎక్కువ స్పెస్ కూడా ఉంటుందని, కియారాకి చాలా కంఫర్ట్ ఉంటుందని భావించి సిద్దార్థ్ కొన్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇలాంటి కారు బాలీవుడ్ స్టార్స్ లో అతికొద్దిమంది వద్ద మాత్రమే ఉందంట. ఈ విషయం తెలియడంతో చెకప్స్ కోసం కోటి రూపాయల కారు.. ఏంటమ్మా కియారా ఇది అని కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇక కియారా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భరత్ అనే నేను సినిమాతో తెలుగుతెరకు పరిచయమై మంచి హిట్ అందుకున్న కియారా.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించిన ఆమె ఈ ఏడాది రిలీజైన గేమ్ ఛేంజర్ లో కూడా సందడి చేసింది. ప్రెగెన్సీ వలన కియారా ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉంది. బిడ్డ పుట్టాకా ఆమె సినిమాలు చేస్తుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: