Singer Chinmayi Post: సింగర్ చిన్మయి వివాదస్పద పోస్ట్ – అలాంటి వారు ఉగ్రవాదులతో సమానం..

Singer Chinmayi Controversial Post Viral: జమ్మూకశ్మీర్ పహల్గామ్ దాడి ఘటనపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. హిందువులే టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. దీంతో ఈ ఘటనపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది క్రూరమైన చర్య, దీనిని తిప్పుకొట్టాలని భారతీయులు కోపంతో ఊగిపోతున్నారు. ఈ ఘటనను ఉద్దేశిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వేదికగా ఈ ఘటనను ఖండిస్తూ మరణించిన వారికి నివాళులు అర్పిస్తున్నారు.
చిన్మయి పోస్ట్ లో ఏముందంటే..
రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పోయారు.అయితే ప్రతిఒక్కరు దీనిని ఖండిస్తూ పోస్ట్స్ చేస్తుంటే సింగర్ చిన్మయి మాత్రం ఓ వివాద పోస్ట్ పెట్టింది. ప్రజలను చంపేవాళ్లు ఉగ్రవాదులు అయితే.. కులం పేరుతో మనుషులు మానసికంగా హింసించేవారు కూడా ఉగ్రవాదులతో సమానమే అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇంతకి చిన్మయి ఏమన్నందంటే.. “నేను షెడ్యూల్ కులానికి చెందిన అమ్మాయిని. అయితే సోకాల్డ్ హిందువులు.. నన్ను వారిలో ఒకరిని అని కూడా మర్చిపోయారు. నా చిన్నతనంలో మా గ్రామంలోని గుడికి వెళ్లేదాన్ని. పూజారి నాకు నేరుగా ప్రసాదం ఇచ్చేవారు కాదు. ఇక నా కాలేజీ రోజుల్లో మా లెక్చరర్ తరచూ ఇలా అనేవారు. ‘రిజర్వేషన్ తో సీటు తెచ్చుకుని మా నెత్తిమీద కూర్చున్నారు’ అని తరచూ హేళన చేసేవారు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను.
ఎన్నో అవమానాలు పడ్డాను..
ఇది చెప్పడానికి బాధగా ఉన్నా.. నా చుట్టూ ఉండే అగ్ర కులానికి చెందినవాళ్లు, కులం ఆధారంగా ఇతరులను చిన్నచూపు చూసేవాళ్లందరు కూడా టెర్రరిస్టులతో సమానం. ఇది నాకు చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే వాళ్లంత నా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించారు. కొందరు మతం పేరుతో చంపేస్తున్నారు మరికొందరు కులం పేరుతో ఆదిపత్యం చూపించి మానసికంగా చంపేస్తున్నారు. ఈ రెండింటికి పెద్ద తేడా లేదు. కాబట్టి నా దృష్టిలో ఉగ్రవాదులు, ఇలాంటి వారు ఒక్కటే” అంటూ రాసుకొచ్చింది. అయితే తన పోస్ట్‌కి చిన్మయి కామెంట్స్ సెక్షన్ డిసెబుల్ చేసింది. కానీ, ప్రస్తుతం తన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రదాడి వల్ల తీవ్ర ఆగ్రహంలో ఉన్న భారతీయులు.. మరి చిన్మయి పోస్ట్‌పై ఎలా స్పందిస్తారు.. ఇది ఎలాంటి వివాదానికి దారితీస్తుందో చూడాలి!
View this post on Instagram