Gold and Silver Price Today : తగ్గిన బంగారం ధరలు!

Gold and Silver Price : పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మన దేశంలో ఏ శుభకార్యానికైనా బంగారం ఉండాలస్సిందే. ఈ నెల పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందు గుర్తొచ్చేవి బంగారమే. అంర్జాతీయంగా పెట్టుబడి పెట్టేవారు బంగారంపై అధిక ఆసక్తిని చూపడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. దాంతో పాటే చైనా పై అమెరికా అధిక సుంఖాలను విధించడంతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిపోయాయి. అనూహ్యంగా ట్రంప్ చైనాపై పెంచిన సుంఖాలను తగ్గిస్తామని ప్రకటించడంతో బంగారం ధర రెండురోజులుగా తగ్గుముఖం పట్టింది.
హైదరాబాద్ బంగారం వెండి ధరలు
బంగారం: హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.98,090గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.98,240గా ఉంది.
వెండి కిలో : హైదరాబాద్ లో వెండి కిలో రూ.99,248 గా ఉంది.
విజయవాడలో బంగారం, వెండి ధరలు
22 క్యారెట్ల బంగారం ధర 96,220, 24 క్యారెట్ల బంగారం ధర రూ.96,225గా ఉంది.
వెండి కిలో విజయవాడలో కిలో వెండి ధర 100,700గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒడుదొబుకుల్లో కొనసాగుతోంది. ఒక రోజు క్రితం బంగారం ధర తగ్గగా మళ్లీ స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3500 డాలర్లకు చేరగా,ఒక రోజు క్రితం 3300డాలర్లకు పడిపోయింది. మళ్లీ తిరిగి 3350కు చేరింది. వెండి రేటు 33.45 డాలర్ల వద్ద ఉంది.