Samantha: ట్రెడిషనల్ టచ్ ఉన్న మోడ్రన్ డిజైన్ డ్రెస్లో సామ్ మెరుపులు

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్.. ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారింది.

శుభం అనే సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శుభం సినిమా హిట్ అవ్వాలని సామ్ తిరుమలకు వెళ్లడం, అక్కడ ఆమె బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ కనిపించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీని షేక్ చేసాయి.

ఇక ప్రస్తుతం సామ్ పలు సినిమాల్లో నటిస్తుంది. ముఖ్యంగా ఒక హిందీ వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తుంది.

ససోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సామ్.. తాజాగా తన కొత్త ఫోటలను అభిమానులతో పంచుకుంది.

అబుదాబిలో ఈ ఫోటోషూట్ జరిగినట్లు సామ్ చెప్పుకొచ్చింది. బ్లూ కలర్ డిజైనర్ డ్రెస్ లో అమ్మడు మెరిసిపోయింది.

ట్రెడిషినల్ టచ్ తో ఉన్న మోడ్రన్ డ్రెస్ పై మరింత మెరిసే డైమండ్స్ తో సమంత ఇంకా అందంగా కనిపించింది.

మయోసైటిస్ వ్యాధి ద్వారా కళ తప్పినట సామ్ ముఖం ఇప్పుడు మళ్లీ మెరిసిపోతుంది. పాత సామ్ లా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.