Published On:

Samsung Galaxy S24 FE 5G: సామ్‌సంగ్ సూపర్ ఆఫర్.. గెలాక్సీ S24 FE 5Gపై రూ.18 వేల డిస్కౌంట్.. డీల్ అదిరిపోయిందిగా..!

Samsung Galaxy S24 FE 5G: సామ్‌సంగ్ సూపర్ ఆఫర్.. గెలాక్సీ S24 FE 5Gపై రూ.18 వేల డిస్కౌంట్.. డీల్ అదిరిపోయిందిగా..!

Samsung Galaxy S24 FE 5G: పెళ్లిళ్ల సీజన్ వేళ ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ మంచి జోరు మీద ఉంది. Samsung Galaxy S24 FE 5G ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుంచి 30 శాతం డిస్కౌంట్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయచ్చు. ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లలో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.59,999కి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు కనీసం రూ.41,999కి కొనుగోలు చేయచ్చు. అంటే ఫ్లాట్ డిస్కౌంట్ రూ.18,000 లభిస్తుంది.

 

Samsung Galaxy S24 FE 5G Offers
అంతేకాకుండా అమెజాన్ మరెన్నో ఆఫర్లను అందిస్తుంది. ఇందులో బ్యాంక్ ఆఫర్లు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. మీకు IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.2,100, ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. అలానే ఈఎమ్ఐ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.28,730 వరకు డిస్కౌంట్ కూడా పొందచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది, ఫోన్ పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.

 

Samsung Galaxy S24 FE 5G Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE‌లో 6.7-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోలెడ్ ప్యానెల్‌ ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను అందిస్తుంది. లాగ్-ఫ్రీ పర్ఫామెన్స్, గేమింగ్ కోసం ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌ అందించారు. 8జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI సాఫ్ట్‌వేర్ స్కిన్‌‌పై రన్ అవుతుంది.

 

Samsung Galaxy S24 FE 5G Camera
సామ్‌సంగ్ వెనుక ప్యానెల్‌లోని ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది కాకుండా, సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 10MP ఫ్రంట్ కెమెరా అందించారరు. మెరుగైన ఫోటోగ్రఫీ అనుభవం కోసం ఇందులో ప్రోవిజువల్ ఇంజిన్‌ ఉంది. ఇది కాకుండా, HDRలో ఆప్టిమైజ్ చేసిన కలర్స్ కూడా కనిపిస్తాయి.

 

Samsung Galaxy S24 FE 5G Battery
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 FE‌లో 4700mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 25W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ అందించారు. దీనితో పాటు, గెలాక్సీ AI ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి, వీటిలో సర్కిల్-టు-సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, నోట్ అసిస్ట్ వంటి మొదలైన ఫీచర్లు ఉన్నాయి.