Sekhar Master: ఆ కామెంట్స్ బాధిస్తున్నాయి – జాను లిరి వ్యవహరంపై స్పందించిన శేఖర్ మాస్టర్

Sekhar Master Reacts on Women Dancer Issue: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మధ్య ఆయన కొరియోగ్రఫిపై అభ్యంతరాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కొరియోగ్రఫీ శ్రుతి మించుతోందని, డ్యాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా ఉంటున్నట్టు అభిప్రాయాలు వస్తున్నాయి. అంతేకాదు ఇటీవల డాకు మహరాజ్ మూవీలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి చేసిన దబిడి దిబిడి సాంగ్‌పై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
ఈ పాటలోని స్టేప్స్ మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి మహిళ సంఘాలు మండిపడ్డాయి. ఆ తర్వాత నితిన్ రాబిన్ హుడ్ మూవీలో అదితా సర్ప్రైజు పాటలోనూ అదే రిపీట్ అయ్యింది. ఇలా వరుసగా వివాదాల్లో నిలుస్తున్న శేఖర్ మాస్టర్ ఓ ఢి కంటెస్టెంట్ వల్ల హాట్‌టాపిక్‌గా మారాడు. ప్రముఖ డ్యాన్స్ సో కంటెస్టెంట్ జాను లిరినికి శేఖర్ మాస్టర్‌కి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని, అందుకే ఆమె ఎప్పుడూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తుంటాడు అంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై ఆయనకు ప్రశ్న ఎదురైంది.
ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో శేఖర్ మాస్టర్‌ను దీనిపై ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఒక షో జడ్జ్‌గా నేను చేయాల్సింది చేశాను. బాగా చేస్తే ప్రశంసించడం తప్పా? నేను ఆ సీట్లో కూర్చున్నప్పుడు నిజాయితీగా ఉండాలి. అందరిలాగే ఆ అమ్మాయి కూడా షోకి వచ్చింది. ఆ అమ్మాయి డ్యాన్స్ బాగా చేసింది అనిపించింది. జాను నువ్వు బాగా చేశావు అని చెప్పాను. ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది కాబట్టే విన్నర్ అయ్యింది దాన్ని పట్టుకుని జనాలు అంతా మా మధ్య ఏదో ఉంది, నేనేదో చేశానంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్ చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. ఏం లేని దానికి కూడా కూడా భూతద్ధంలో చూస్తు తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తమ మధ్య ఏం లేదని, ఈ విషయం అక్కడ యూనిట్‌లోని అందరికి తెలుసన్నారు. ఆ షో తర్వాత ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. సోషల్ మీడియలోనూ నా పోస్టులకు ఆ అమ్మాయి గురించి కామెంట్స్ పెడుతున్నారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. ఆమెకు కుటుంబం ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. ఇలాంటి ఆరోపణలు చేసేముందు కాస్తా ఆలోచింది. ఇది కరెక్ట్ కాదంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.