Published On:

Murder in AP: దారుణం.. ఆస్తి కోసం ఏకంగా తల్లిదండ్రులను ట్రాక్టర్‌తొ తొక్కించిన కుమారుడు!

Murder in AP: దారుణం.. ఆస్తి కోసం ఏకంగా తల్లిదండ్రులను ట్రాక్టర్‌తొ తొక్కించిన కుమారుడు!

Son killed parents for property: రోజురోజుకూ విలువలు దారుణంగా తయారవుతున్నాయి. ప్రాణం అంటే లెక్క లేకుండా పోతోంది. డబ్బు కోసం ఏకంగా సొంత వాళ్లను సైతం చంపేందుకు వెనకడుగు వేయడం లేదు. ఆవేశంలో ఏం చేస్తున్నామో తెలియకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలకే అన్నదమ్ములు, తల్లిదండ్రులు, తోబుట్టువులను సైతం హత్య చేస్తున్నారు. తాజాగా, ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిలో వాటా విషయంలో వచ్చిన ఘర్షణలో కుమారుడు ఏకంగా తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశాడు.

 

విజయనగరం జిల్లాలోని పూసలపాటిరేగలో నడిపూరికల్లాలుకు చెందిన అప్పలనాయుడు(55), జయ(45)లను వారి కుమారుడు రాజశేఖర్ హత్య చేశాడు. తన చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వడంతో తల్లిదండ్రులపై రాజశేఖర్ కక్ష పెంచుకున్నాడు. దీంతో గత కొంతకాలంగా ఈ విషయంపై ఇంట్లో వాగ్వాదం చోటుచేసుకుంటుంది.

 

అయితే తమ కుమార్తెకు తల్లిదండ్రులు కొంత భూమిని వాటాగా ఇచ్చారు. తమ కుమార్తెకు ఇచ్చిన భూమిని రాజశేఖర్ స్వాధీనం చేసుకొని చదును చేస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ఈ విషయంపై ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా పొలం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.