IPL 2025: పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ఊచకోత.. కోల్‌కతా టార్గెట్ ఇదే!

Punjab Kings High Score: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 44వ మ్యాచ్ రసతవ్తరంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.
పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రన్ సింగ్(83, 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (69, 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఊచకోత కోశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25) రాణించడంతో పంజాబ్ 200ల మార్క్‌కు చేరింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రస్సెల్ చెరో వికెట్ తీశారు.