Actor Babloo Prithiveeraj: ఈవెంట్‌కి పిలిచి అవమానించారు – ‘యానిమల్’ తర్వాత పెద్ద స్టార్ అయ్యాననుకున్నా, కానీ..

Prithiveeraj Comments on Utsavam Event Incident: ఓ సినిమా ఈవెంట్‌లో తనని ఘోరంగా అవమానించారంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్. ఇటీవల తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. భారీ చిత్రాల్లో విలన్, సహాయ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్తుతం ఆయన తెలుగులో రాణిస్తున్నారు. రీసెంట్‌గా కళ్యాణ్ రామ్ ‘అర్జున్ S/0 వైజయంతి’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్‌లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తను నటించిన ఓ సినిమా ఈవెంట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనీసం నన్ను పట్టించుకోలేదు, గ్రూప్ ఫోటో అని పిలిచి అవమానించారంటూ ఆయన వాపోయారు. “గతేడాది రిలీజైన ఉత్సవం చిత్రంలో నేను కూడా నటించాను. కరోనా కంటే ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా 2024లో విడుదలైంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు మూవీ టీం నాకు ఫోన్ చేసింది. అప్పుడు నేను ఈ ఈవెంట్ నిర్వహిస్తున్న హోట్‌లోనే ఉన్నాను.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావాలని చెప్పడంతో ఇతర సినిమాల షూటింగ్స్ నుంచి పర్మిషన్ తీసుకుని హాజరయ్యాను. వెళ్లగానే దర్శక-నిర్మాతలను పలకరించాను. వారి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. బిజీ ఉన్నారని అర్థం చేసుకుని వెళ్లి స్టేజ్ ముందు ఉన్న సీట్‌లో కూర్చున్నాను. అయితే మూవీ టీంకి సంబంధించి వేరే వస్తున్న ప్రతిసారి నన్ను పక్కకు జరుగమన్నారు. అలా ఈ వరుసలో నేను చివరికి వెళ్లిపోయా. ఈవెంట్ మొదలైయ్యాక హీరోహీరోయిన్లతో పాటు నా పక్కన కూర్చున్న సాంగ్ రైటర్స్, మేకప్ ఆర్టిస్ట్స్ అందరిని స్టేజ్‌పైకి పిలిచారు. కానీ నన్ను మాత్రం పిలవలేదు. చివరిలో గ్రూప్ ఫోటో ఉందని స్టేజ్‌పైకి పిలిచారు.
అక్కడ కూడా నన్ను వెనకాల వెళ్లి నిలుచోమన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడితో మాట్లాడుతుంటే మధ్య వచ్చి ఆయనను తీసుకువెళ్లిపోయారు. గ్రూప్ ఫోటో దిగుతుంటే.. నన్ను వెనక్కి వెళ్లమనడంతో వెళ్లి నిలుచున్న. నా పక్కన ఉన్న నటుడు గిరిబాబును ముందుకు వచ్చి నిలుచోమన్నారు. యానిమల్‌లో లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రంలో నటించడంతో నేనూ పెద్ద స్టార్ అయ్యాను అనుకున్నా. కానీ, ఇక్కడ ఎవరూ నన్ను పట్టించుకోలేదు. అది నన్ను చాలా బాధించింది. నాకు జరిగిన ఈ అవమానాన్ని ఎప్పటికి మర్చిపోలేను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి:
- AR Rahman: కాపీ రైట్ కేసు – ఢిల్లీ హైకోర్టులో ఏఆర్ రెహమాన్‌కు చుక్కెదురు.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే..