Published On:

Allu Arjun at Cousin Marriage: పెళ్లిలో అల్లు అర్జున్‌ సందడి.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన బన్నీ దంపతులు!

Allu Arjun at Cousin Marriage: పెళ్లిలో అల్లు అర్జున్‌ సందడి.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన బన్నీ దంపతులు!

Allu Arjun attends his Cousin Marriage with Wife Sneha and Daughter: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తన భార్య స్నేహరెడ్డి, కూతురు ఆర్హతో కలిసి ఈ వేడుకలో ఆనందంగా కనిపించారు. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్‌ క్లిష్ట పరిస్థితులను చూశారు. సంధ్య థియేటర్‌ ఘటన కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారు. అలా వివాదంలో నిలిచిన బన్నీ అప్పటి నుంచి బయట కార్యక్రమాల్లో కనిపించనే లేదు. ఆ తర్వాత తన లుక్ మేకోవర్‌ నేపథ్యంలో విదేశాలకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో గతకొద్ది రోజులుగా మీడియా, సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ సందడి తగ్గిపోయింది.

 

పెళ్లిలో బన్నీ సందడి

ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్‌ ఇలా ఓ పబ్లిక్‌ ఫంక్షన్‌లో కనిపించడంతో అభిమానులంత మురిసిపోతున్నారు. ఇక అతడి లేటెస్ట్‌ లుక్‌ గురించే అంత చర్చించుకుంటున్నారు. పెళ్లి వేడుకలోని బన్నీ ఫోటోలు వైరల్‌ చేస్తూ.. ఏమున్నాడ్రా బాబూ అంటూ కామెంట్స్‌ చేస్తుంది. మోస్ట్‌ హ్యాండ్సమ్‌ అంటూ అల్లు అర్జున్‌ లుక్‌కి ఫిదా అవుతున్నారు. కాగా అల్లు అర్జున్‌ హాజరైన ఈ పెళ్లి ఆయన కజిన్‌ది అని తెలుస్తోంది. ఈ పెళ్లికి తన భార్య,పిల్లలతో కలిస సకుటుంబ సమేతంగా హాజరయ్యారు.

 

స్పెషల్‌ అట్రాక్షన్‌గా అల్లు అర్జున్ దంపతులు

స్నేహా కూడా చాలా అందంగా ముస్తాబైంది. ఈ పెళ్లి అల్లు అర్జున్‌-స్నేహరెడ్డి దంపతులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.  అల్లు అర్జున్‌ దంపతులు స్టేజ్‌పైకి వెళ్లి అంక్షితలు వేసి నూతన వధువరులను ఆశీర్వాదించారు. అనంతరం వారితో ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. అక్కడ అల్లు అర్జున్‌ చూసేందుకు పెళ్లి వచ్చినవారంత తెగ ఆసక్తి చూపించారు. బన్నీతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. కాగా ఇటీవల బన్నీ ఎంతగా వివాదంలో నిలిచాడో అంతకుమించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకున్నాడు. పుష్ప 2తో ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌ సునామీ సృష్టించాడు. రికార్డుల మీద రికార్డు బ్రేక్‌ చేస్తూ కొత్త రికార్డులు క్రియేట్‌ చేశాడు.

 

 

పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్

ఇండియన్‌ మూవీ చరిత్రలోనే బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన రెండోవ సినిమాగా ‘పుష్ప 2’ నిలిచింది. దీంతో ఈ బన్నీ బాయ్‌ క్రేజ్‌ ఇప్పుడ నేషనల్‌ నుంచి ఇంటర్నేషనల్‌ స్థాయికి చేరుకుంది. ఇక నెక్ట్స్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ డైరెక్టర్‌ అట్లీతో జతకట్టబోతున్నాడు. వీరిద్దరి కాంబో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకోబోతోంది. ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. AA22-A6 పేరుతో ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్‌ లాంచ్‌కు సిద్ధమవుతున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం.