Published On:

Simran: ఆంటీ-డబ్బా రోల్స్‌ కామెంట్స్‌ – హీరోయిన్లు ఎప్పటికీ స్నేహితులు కాలేరు..

Simran: ఆంటీ-డబ్బా రోల్స్‌ కామెంట్స్‌ – హీరోయిన్లు ఎప్పటికీ స్నేహితులు కాలేరు..

Simran clarifies About aunty roles and dabba roles: ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో నటి సిమ్రాన్‌ చేసిన కామెంట్స్‌ హాట్ టాపిక్‌గా మారాయి. గతవారం చెన్నై వేదికగా జేఎఫ్‌డబ్య్లూ అవార్డ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. తమిళ్‌, మలయాళ ఇండస్ట్రీ తమ నటననతో అబ్బురపరిచిన నటీమణులను ఈ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును నటి సిమ్రాన్‌ ఎన్నికైంది. ఈ కార్యక్రమంలో అవార్డు అందుకున్న ఆమె అనంతరం మాట్లాడుతూ.. తన సహా నటి చేసిన తనని ఎంతో బాధించిందని షాకింగ్‌ విషయం చెప్పారు.

 

ఆమె వ్యాఖ్యలు నన్నేంతో బాధించాయి..

తను చేసిన ఆంటీ రోల్స్‌పై విమర్శలు చేసినట్టు చెప్పారు. అయితే తాజాగా సిమ్రాన్‌ తన వ్యాఖ్యలకు మరోసారి వివరణ ఇచ్చింది. “నా సహా నటి చేసిన కామెంట్స్‌ నన్నేంతో బాధించాయి. ఆ బాధ వల్లే ఇటీవల జరిగిన అవార్డు కార్యక్రమంలో నాకు అనిపించింది చెప్పాను. నటిగా నా కెరీర్‌ ఆరంభం నుంచి నేను ఆంటీ రోల్స్‌ చేస్తున్నా. ఇంకా చెప్పాలంటే ఆ పదం అంటే నాకు ఇష్టం. అందులో పెద్దగా ఇబ్బంది ఏం అనిపించలేదు. నా 25 ఏళ్ల వయసులోనే ‘కన్నత్తిల్‌ ముతమిట్టల్‌’లో తల్లి పాత్రలు చేశాను. ఆ పాత్ర చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంటీ రోల్స్‌ చేయడంలో తప్పేముంది” అని పేర్కొంది.

 

హీరోయిన్లు ఎప్పటికీ స్నేహితులు కాలేరు

“సలు నిజం ఏంటంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్‌ ఎప్పటికీ స్నేహితులు కాలేరు. నాకు ఎదురైన అనుభవంతో మరోసారి నిజమైంది. మంచి స్నేహితులు అనుకున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో వారి వ్యాఖ్యలతో మనల్ని బాధిస్తారు. నాకు అదే అనుభవం ఎదురైంది. అదే అవార్డు ఫంక్షన్‌లో చెప్పాను. ఆ మరుసటి రోజే ఆ నటి నాకు ఫోన్‌ చేసింది. దానివల్ల నేను ఏం ఇబ్బంది పడలేదు. కానీ, ఆమెతో అంతకు ముందు ఉన్న రిలేషన్‌ ఇప్పుడు లేదు” అని సిమ్రాన్‌ చెప్పుకొచ్చింది.

 

పనికి మాలిన డబ్బా రోల్స్..

కాగా ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో మాట్లాడుతూ సిమ్రాల్‌ ఇలా చెప్పింది. “రీసెంట్‌గా నాతో కలిసిన నటించిన నటి ఆమె. ఇటీవల ఆమె ఓ సినిమా చేసింది. అందులో ఆమె నటన నన్ను ఆశ్చర్యపరించింది. ఇదే విషయాన్ని ఆమె చెబుతూ మెసేజ్‌ చేశారు. ‘మీరు చాలా బాగా నటించారు. మిమ్మల్ని ఆ పాత్రలో చూసి ఆశ్చర్యపోయాను’ అని చెప్పాను. నిజంగా నాకు అనిపించిన జన్యున్‌ అభిప్రాయాన్ని చెప్పాను. దానికి ఆమె ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ రిప్లై ఇచ్చింది. ఆమె చులకనగా మాట్లాడినట్టు అనిపించింది. అది నాకేంతో బాధకలిగింది. అయితే ఆ నటిగా ఈ స్టేజ్ వేదికగా నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు చేయడం చాలా బెటర్‌. దేనీన చులకనగా చూడకూడదు” అంటూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.