Indian Army Blast House of Terrorist: పహల్గామ్ ఉగ్రదాడి.. లష్కరే ఉగ్రవాది ఆసిఫ్ ఇల్లును పేల్చేసిన ఇండియన్ ఆర్మీ

Indian Army Blast House of Terrorist Following Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి నేపథ్యంలో భారత ఆర్మీ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జమ్మూకశ్మీర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఉగ్రదాడిలో ఉగ్రవాది ఆదిల్ షేక్ పాత్ర ఉండడంతో త్రాల్‌లో ఆయన ఇల్లును పేల్చివేసింది. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇల్లును భారత ఆర్బీ పేల్చేసింది.
ప్రస్తుతం బిజ్‌బెహరా, త్రాల్ ప్రాంతాల్లో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్‌లో లోకల్ టెర్రరిస్టుల నివాసాలపై దాడి చేస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్ షేక్ పాత్ర ఉండడంతోనే ఇల్లు పేల్చినట్లు తెలుస్తోంది. అలాగే బిజ్‌బెహరాలో మరో ఉగ్రవాది ఆసిప్ ఇల్లును భారత ఆర్మీ కూల్చివేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్, ఆసిఫ్ సూత్రధారులుగా ఉన్నారు. వీళ్ల ఆచూకీ చెప్పిన వారికి రూ.20లక్షల రివార్డు కూడా ప్రకటించారు.
ఇదిలా ఉండగా, భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలోని పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. అలాగే సెలవులపై వెళ్లిన సైనికులను సైతం వెంటనే తిరిగి రావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా, శ్రీనగర్‌లో భద్రతా కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు ఆర్మీ చీఫ్ ద్విదేది చేరుకున్నారు. ఈ మేరకు సరిహద్దుల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అనంరతం శ్రీనగర్, ఉదమ్ పూర్‌లో పర్యటన చేయనున్నారు.
#Retribution House of #Terrorist Adil Thokar turned in to rubble. #Terrorist involved in #PahelgamTerroristattack #Pahelgam @IndianArmyHero V.CTSY :PTI #pahelgam #TerrorAttack #KashmirAttack pic.twitter.com/DVkH8m9e71
— Tapas Sengupta (@k_tapas1) April 25, 2025