HIT 3 Censor Report: నాని ‘హిట్ 3’ సెన్సార్ రిపోర్టు వచ్చేసింది – ఆ సీన్లపై బోర్డు అభ్యంతరం, రన్ టైం ఎంతో తెలుసా..?

Nani’s HIT 3 Movie Censor Report and Runtime: నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT 3 Movie) రిలీజ్‌కు రంగం సిద్ధమవుతుంది. మే 1న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇక నాని వరుసగా ఇంటర్య్వూలు ఇస్తూ ఫుల్ బిజీ బిజాగా ఉన్నాడు. మరోవైపు సినిమా రిలీజ్‌కు మూవీ టీం రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా హిట్ 3 ఫైనల్ అవుట్‌ఫుట్‌ను తాజా సెన్సార్ బోర్డు పంపించారు.
ఏ సర్టిఫికేట్ జారీ..
ఇక ఈ సినిమా చూసి బోర్డు సభ్యులు మూవీ ఏ సర్టిఫికేట్ చేసింది. అలాగే చిత్రంలోని కొన్ని మార్పులకు ఆదేశించినట్టు సమాచారం. కాగా హిట్ 3లో ఫుల్ వయోలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు బూతులు కూడా బాగానే వాడారు. దీనిపై సెన్సార్ బోర్డు కొన్ని కండిషన్స్‌తో ఏ సర్టిఫికేట్ ఇచ్చిందట. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం రన్ టైం 2:37 గంటలు ఉంది. ఈ సినిమాలో సబ్‌టైటిల్స్‌తో పాటు ‘ఎఫ్’ వర్డ్‌ను తక్కువగా వినియోగించాలని, కొన్ని సీన్లలో మ్యూట్ చేయాలని బోర్డు సూచించిందట. అలాగే ఓ సన్నీవేశంలో వాడిన పదంపై బోర్డు అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది.
ఆ సీన్ మ్యూట్ చేయాలి..
సినిమాల్లో దీన్ని మ్యూట్ చేయాలని తప్పనిసరిగా సూచించిందట. ఇక పోలీసు యూనిఫాం కాలిపోతున్న దృశ్యాలను మార్చాలని, కాళ్లు,చేతులు, వేళ్లు కట్ చేసే సీన్స్‌లో ఫ్లాష్ తగ్గించాలని చెప్పినట్టు సమాచారం. ఇక రక్తం చిందే సీన్లలో రెడ్ కలర్ డార్క్ లేదా బ్లాక్ అండ్ వైట్ చేయాలని బోర్డు సూచించిందట. దీంతో సెన్సార్ బోర్డు సూచనల మేరకు మూవీ టీం సినిమాలో మార్పులు, చేర్పులు చేసి ఫైనల్ కాపీని సమర్పించింది. కాగా హిట్ ఫ్రాంఛైజ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రెండు పార్టులు మంచి విజయం సాధించాయి.
ఇక మూడో పార్ట్‌లో అంతకు మించి ఉంటుందనేలా ఉన్నాయి టీజర్, ట్రైలర్. ఇందులో నాని అర్జున్ సర్కార్‌గా పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో నాని వయోలెన్స్ లుక్‌కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు న్యాచురల్ నటనతో మెప్పించిన నాని.. ఇక వయోలెన్స్‌తో ఎలాంటి రచ్చ చేయనున్నాడని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో నాని సరసన కేజీయఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
- Allu Arjun at Cousin Marriage: పెళ్లిలో అల్లు అర్జున్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన బన్నీ దంపతులు!