Shruti Haasan: వారి విడాకుల నుంచి ఎన్నో నేర్చుకున్నా.. బెంజ్ నుంచి లోకల్ ట్రైన్ కి షిఫ్ట్ అయ్యా

Shruti Haasan: ప్రతి బిడ్డకు తమ తల్లిదండ్రులే దైవంగా ఉంటారు. చిన్నతనం నుంచి ఒకే కుటుంబంగా కలిసి ఉన్నవారు.. ఒక్కసారిగా విడిపోతే ఆ పిల్లలకు బాధ తప్ప ఇంకేమి ఉండదు. తండ్రి ఒకచోట.. తల్లి ఇంకోచోట. ఎక్కడ ఉండాలో వారికే తెలియదు. అలాంటి సమయంలో ఆ పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అదే పరిస్థితి తను కూడా అనుభవించానని స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
లోక నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో శృతి తెలుగు ఎంట్రీ ఇచ్చాడు. నటిగానే కాకుండా సింగర్ గా కూడా తన సత్తా చూపించింది మొదటి సినిమా నుంచి గబ్బర్ సింగ్ సినిమ వచ్చే వరకు శృతికి ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. గబ్బర్ సింగ్ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక సినిమాల కన్నా బ్రేకప్ ల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యిన శృతి.. ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తుంది.
ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల విడాకులు తనను ఎంతో బాధపెట్టాయని, వారి విడాకుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు తెలిపింది. కమల్ హాసన్ రెండో భార్య, నటి సారిక కుమార్తె శృతి హాసన్. 1988 లో కమల్, సారిక ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఈ జంటకు శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. ఇక కొన్ని విభేదాల కారణంగా 2004 లో ఈ జంట విడిపోయారు.
” నేను సినిమాల్లోకి రావడానికి ముందు నా జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. నా పేరెంట్స్ విడాకులు తీసుకోవడం నన్ను ఎంతో బాధించింది. నాన్న బంక్ఒhi విడిపోయాక అమ్మతో పాటే ముంబైకి వెళ్ళిపోయాం. ఒక్క సారిగా బెంజ్ లో తిరిగే నేను ముంబైలో లోకల్ ట్రైన్ లో తిరగడం మొదలుపెట్టాను. అప్పటివరకు నా జీవితం ఎలా ఉండేదో.. ఆ తరువాత అంతా మారిపోయింది. ఎంత రిచ్ గా బ్రతికానో.. అంతకుమించి కష్టాలను కూడా చూసాను. ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాకనే నేను నాన్నతో కలిసి ఉంటున్నాను. ఆ తరువాత నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.