Published On:

Top LeT commander ltaf lalli killed: బందిపొరాలో ఎదురుకాల్పులు.. లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం!

Top LeT commander ltaf lalli killed: బందిపొరాలో ఎదురుకాల్పులు.. లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం!

Top LeT commander ltaf lalli killed by India Army in Bandipora:  జమ్మూకశ్మీర్‌లో వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బందిపొరాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ భీకర కాల్పుల్లో లష్కరే తయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని భద్రతా దళాలు మట్టుబెట్టనట్లు తెలుస్తోంది.

 

అంతకుముందు, జమ్మూకశ్మీర్‌లోని బందిపొరాలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టింది. ఆర్మీ జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా దళాలు సైతం ఎదురుకాల్పులు జరిపింది. దీంతో ఇరు వర్గాలకు భీకర కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారు. ఉదయం నుంచి బందిపొరాలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తుండగా.. బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఇవాళ ఉదయం ఇండియన్ ఆర్మీ, పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగానే ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొదట ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో ఓ అధికారి బాడీగార్డులకు బుల్లెట్లు తగిలాయి. వెంటనే ఆర్మీ ఎదురుకాల్పులు జరిపి అల్తాఫ్ లల్లీని అంతమొందించాయి.