Nidhhi Agerwal Counter to Netizens: శ్రీలీలతో పోల్చి సెటైరికల్ కామెంట్స్.. నెటిజన్‌కి నిధి అగర్వాల్ స్ట్రాంగ్ కౌంటర్

Nidhhi Agerwal Counter to Netizen Who Slams Her: తనపై విమర్శలు చేసిన ఓ నెటిజన్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఓ నెటిజన్ ట్విటర్‌లో శ్రీలీలతో పోలుస్తూ నిధిపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. ఇది చూసిని నిధి సదరు నెటిజన్‌కి ఇచ్చి పడేసింది. అసలేం జరిగిందంటే.. నిధి అగర్వాల్ ప్రస్తుతం హరి హర వీరమల్లుతో పాటు రాజాసాబ్‌లో చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో ఆమె రీఎంట్రీ ఇస్తున్న సినిమాలివే కావడం విశేషం. ఇవి ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఇంకా రిలీజ్ కాలేదు.
శ్రీలీల కంటే ముందు వచ్చి ఏం చేసింది..?
నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో నిధి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దీని తర్వాత నిధి మిస్టర్ మజ్నులో నటించింది ఇది ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆమె తెలుగులో మరే సినిమా నటించలేదు. తాజాగా దీనిపై ఓ నెటిజన్ నిధిపై విమర్శలు చేశారు. నిధి అగ్వాల్‌కు సంబంధించిన ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టగా.. దానిపై ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. “2019లో ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఏం చేసింది? ఎన్ని చేసింది? అని.. ఆమె తర్వాత 2021లో వచ్చిన శ్రీలీల 20పైగా సినిమాలు చేసింది” అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇది కాస్తా నిధి అగర్వాల్ కంట పడింది.
నాకంత తొందర లేదు..
దీనికి ఆమె స్పందిస్తూ.. ఇస్మార్ట్ తర్వాత హీరో మూవీ చేసింది. మూడు తమిళ సినిమాలు చేసింది. అలాగే ‘హరి హర వీరమల్లు’ ఫిలింకి సైన్ చేసింది. నాకు మంచి స్క్రిప్ట్ అనిపిస్తేనే సినిమాలకు సంతకం చేస్తున్నా. అందుకే టైం తీసుకుంటున్నా. కొన్ని సార్లు నా నిర్ణయం తప్పై ఉండోచ్చు. కానీ, మంచి సినిమాలు చేయాలనేదే నా అభిప్రాయం. వరుసగా సినిమాలు చేయాలనే తొందరేం లేదు నాకు. నేను ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నా. కాబట్టి నా గురించి నువ్వేం అంత బాధపడకు బ్రదర్” అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
అయితే ఇస్మార్ట్ శంకర్ తప్పితే నిధి అగర్వాల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఆమె చేసిన వరుస సినిమాలు ప్లాప్ అయ్యాయి. మిస్టర్ మజ్ను తర్వాత తమిళ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత హరి హర వీరమల్లుతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. మరి ఈ చిత్రాల విడుదల తర్వాత నిధి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుంతో చూడాలి! మరోవైపు శ్రీలీల బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోలు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో యమ క్రేజ్ సంపాదించుకుంది. అయితే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆమె ఖాతాలో ఎక్కువ ప్లాప్ సినిమాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- Allegations on Hero Nithiin: హీరో నితిన్ మోసం చేశాడు.. రూ. 75 లక్షలు తీసుకుని హ్యాండ్ ఇచ్చాడు – నిర్మాత సంచలన కామెంట్స్