Priyanka Jain-Shiva: ప్రియాంకకు బ్రేకప్ చెప్పిన శివ – ఏంటీ.. స్టేజ్‌పైనే అలా అనేశాడు!

Actor Shivakumar Break Up With Priyanka Jain: బుల్లితెర క్యూట్ కపుల్లో ప్రియాంక జైన్-శివ కుమార్ జంట ఒకటి. కొన్నేళ్లుగా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. ‘మౌనరాగం’ సీరియల్లో జంటగా నటించిన వీరికి అప్పుడే పరిచయం ఏర్పడింది. ఈ సీరియల్ టైంలో ప్రేమలో పడ్డ ఈ జంట అప్పటి నుంచి రిలేషన్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు కానీ, పెళ్లయిన జంటలకు ఏమాత్రం తీసుపోకుండ లవ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన జంటగా వెళుతుంటారు. తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్స్‌ని రీమేక్ చేస్తూ ఫ్యాన్స్ అలరిస్తున్నారు ఈ రొమాంటిక్ కపుల్.
కొన్నేళ్లుగా రిలేషన్ లో
అయితే వీరిద్దరు పెళ్లేప్పుడు చేసుకుంటారా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ప్రశ్నకు వారి అడిగితే రేపు, ఎల్లుండి అంటూ చెబుతూ వస్తున్నారు. కానీ, ఇంతవరకు పెళ్లి కబురు మాత్రం చెప్పలేదు. ఇక గతేడాది బిగ్‌బాస్ షోలో ప్రియాంక పాల్గొంది. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే పెళ్లని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ ముచ్చటే లేదు. ఇటీవల ఇస్మార్ట్ జోడీ రియాలిటీ షోలో జంటగా పాల్గొన్న సందడి చేశారు. కపుల్స్‌గా షోలో అన్ని ఆటలు ఆడి అలరించి చాలా సంతోషంగా కనిపించారు. అయితే తాజాగా శివ, ప్రియాంకకి బ్రేకప్ చెప్పాడు. శివ.. ప్రియాంకని ముద్దుగా పరి అని పిలుచకుంటాడనే విషయం తెలిసిందే. అయితే స్టార్ మా త్వరలో ప్రారంభం కాబోయే ఓ రియాలిటీ షో పాల్గొన్న శివ, అందరి ముందే ప్రియాంకకి బ్రేకప్ చెప్పాడు.
తొక్కలో పరి..
దీంతో అక్కడ ఉన్నవారంత ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ షోలో అసలేం జరిగిందంటే.. త్వరలో స్టార్ మాలో కిర్రాక్ బాయ్స్, కిలాడీ లేడీస్ సీజన్ 2 ప్రారంభం కానుంది. ఇందులో బుల్లితెర సీరియల్ నటీనటులతో పాటు జబర్థస్త్ షో, యూట్యూబర్స్ పాల్గొన్నారు. వారిలో టీవీ నటుడు శివ కూడా ఉన్నాడు. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఈ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ రియాలిటీ షోకు అదిరిపోయే డ్యాన్స్ ఎంట్రీ ఇచ్చాడు శివ. అయితే ఈ సందర్భంగా ప్రియురాలు ప్రియాంకని శివకు ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు వీడియో కాల్ కి వచ్చింది. అయితే ఏమైంది ఏమో తెలియదు కానీ, యాంకర్ శ్రీముఖి పరి కదా అనగానే తొక్కలో పరి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
View this post on Instagram
ఇప్పుడే ప్రియాంకకి బ్రేకప్ చెబుతున్నా
ఆ తర్వాత ఆన్‌లైన్‌కి వచ్చి ప్రియాంక ముందే ఆమె ఆన్‌లైన్‌లో ఉండగానే.. ‘ఈ షో అయ్యేవరకు.. బాయ్స్ మళ్లీ గెలిచే వరకు.. నేను నీకు బ్రేకప్ చెబుతున్నా’ అంటూ ఊహించని కామెంట్స్ చేశాడు. దీంతో అక్కడ ఉన్న మిగతా కంటెస్టెంట్స్‌తో పాటు జడ్జీ అనసూయ కూడా షాక్‌తో నోరు వెళ్లబెట్టారు. శివ మాటలకు నొచ్చుకున్న ప్రియాంక .. “నేను మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడతాను.. ఇక నువ్వు దీనికి నువ్వు సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది” అంటూ సీరియస్ అవుతూ వీడియోల్ కాల్ కట్ చేసింది. ఆ వెంటనే శ్రీముఖీ పరి సారీ అంటూ ఏదో చెప్పేలోపే ప్రియాంక కాల్ కట్ చేసి వెళ్లిపోయింది. అయితే ఇది బ్రేకప్ ప్రాంక్ కాల్ అని తెలుస్తోంది. కానీ ప్రియాంక రియాక్షన్ చూస్తుంటే మాత్రమే ఆమె బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. మరి అసలేం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- Prabhas Marriage Rumours: బడా వ్యాపారవేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి! – సీక్రెట్‌గా ఏర్పాట్లు చేస్తున్న శ్యామలా దేవి?