SRH Vs DC: హైదరాబాద్, ఢిల్లీ మధ్య కీలక మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే సన్ రైజర్స్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ లు ఓడిపోయి దాదాపుగా ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలగింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు తక్కువ. మరోవైపు గతంలో సన్ రైజర్స్ పై విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ నేటి మ్యాచ్ లోనూ గెలవాలని చూస్తోంది. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. 10 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ 6 మ్యాచ్ లు గెలిచి 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సచిన్ బేబి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ
ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, నటరాజన్