Published On:

HIT 3 Box Office Collection: సెంచరీ కొట్టేసిన అర్జున్‌ సర్కార్‌ – నాలుగు రోజుల్లోనే హిట్‌ 3 రికార్డు కలెక్షన్స్‌

HIT 3 Box Office Collection: సెంచరీ కొట్టేసిన అర్జున్‌ సర్కార్‌ – నాలుగు రోజుల్లోనే హిట్‌ 3 రికార్డు కలెక్షన్స్‌

HIT 3 Box Office Collections: హీరో నాని మరోసారి సెంచరి కొట్టేశాడు. ఆయన నటించిన లేటెస్ట్‌ మూవీ ‘హిట్‌ 3: ది థర్డ్‌ కేస్‌’ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. శైలెష్‌ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైంది. హిట్‌ ఫ్రాంచైజ్‌ నుంచి మూడో పార్ట్‌గా వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి బజ్‌ నెలకొంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ డే నుంచి హిట్‌ టాక్‌ అందుకుంది.

 

అంతేకాదు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్‌ డే రూ. 43 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. రెండో రోజు, మూడో రోజు కూడా అదే జోరు కనబర్చింది. రెండు రోజుల్లోనే హాప్‌ సెంచరి కొట్టిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. హిట్‌ 3 నాలుగు రోజుల్లోనే రూ. 101 కోట్ల గ్రాస్‌ చేసినట్టు మూవీ మేకర్స్‌ వెల్లడించారు. అటూ ఓవర్సిస్‌లోనూ హిట్‌ 3 దూకుడు చూపిస్తుంది. ఇప్పటి వరకు అక్కడ 2 మిలియన్‌ డాలర్లు వసూళ్లు వసూలు చేసినట్టు మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు హిట్‌ 3 కలెక్షన్స్‌ సంబంధించిన ప్రత్యేక పోస్టర్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

 

హిట్‌ 3 కలెక్షన్స్‌లో ఇటూ భారత్‌లో అటూ ఓవర్సిస్‌లో తగ్గేదే లే అన్నట్టు దూసుకుపోతుంది. తొలి రోజు రూ. 43 కోట్లకుపైగా వసూళ్లు సాధించి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా రికార్డుకు ఎక్కింది. అలాగు రెండో రోజు కూడా రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించగా.. మూడో రోజు రూ. 82 కోట్లకు రీచ్ అయ్యింది. ఇక నాలుగవ రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ రూ. 101 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు బ్రేక్‌ చేసింది. నాని కెరీర్‌లో అతి తక్కువ టైంలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా హిట్‌ 3 నిలిచింది. ఇందులో నాని.. అర్జున్‌ సర్కార్‌గా పవర్ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించాడు. మాస్‌ యాక్షన్‌, వయోలెన్స్‌తో షాకిచ్చాడు. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.