Published On:

Prakash Raj: పాక్‌ నటుడి సినిమాకు ప్రకాశ్‌ రాజ్‌ సపోర్టు – నెటిజన్స్‌ ఫైర్‌

Prakash Raj: పాక్‌ నటుడి సినిమాకు ప్రకాశ్‌ రాజ్‌ సపోర్టు – నెటిజన్స్‌ ఫైర్‌

Prakash Raj Supports Pakistani Actor Fawad Khan Movie: పహల్గామ్‌ ఉగ్రదాడికి తర్వాత భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ చర్యను తిప్పికొట్టేందుకు అన్ని రకాల చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే పాకిస్థాన్‌ పౌరులను తిరిగి దేశం విడిచి తమ స్వదేశానికి వెళ్లాలని ఆదేశించింది. సింధూ జలాల నీటిని ఆపేసింది. పాక్‌ సెలబ్రిటీల ఖాతాలను భారత్‌లో డీయాక్టివేట్‌ చేసింది. వారి యూట్యూబ్‌ ఛానళ్లు, సోషల్‌ మీడియాలో ఖాతాలను సైతం నిలిపివేసింది. అలాగే పాక్‌ నటుల సినిమాలను బ్యాన్‌ చేసింది. దీంతో మే 9న విడుదల కావాల్సి పాకిస్తాన్‌ నటుడు సినిమా అబీర్‌ గులాల్‌ సినిమా రిలీజ్‌ ఆగిపోయింది.

 

పాక్ నటుడు ఫవాద్‌ ఖాన్‌ హీరోగా వాణి కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకునికి విడుదలకు సిద్ధమైంది. మూవీ టీం కూడా ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. అదే టైంలో పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన చోటుచేసుకోవడంతో కేంద్ర సమాచార శాఖ ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెంటనే బాలీవుడ్‌ ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను నిలిపివేసింది. ఇక నటి వాణి కపూర్‌ సైతం ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్‌ని తన ఖాతా నుంచి డిలీట్‌ చేసింది.

 

అయితే పాక్‌ నటుల సినిమాలను భారత్‌లో బ్యాన్‌ చేయడంపై తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. ఓ మీడియా ఛానళ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ.. సినిమాలను నిషేధించడాన్ని నేను సమర్థించను. అది ఎటువంటి సినిమాలైన సరే.. వాటిని జనాల నిర్ణయానికి వదిలేయాలి. శ్రుతిమించిన అశ్లీలత, పిల్లలపై వేధింపులు ఉన్న చిత్రాలను మినహా వేటినీ నిషేధించకూడదని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ఆయన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

 

ప్రకాశ్‌ రాజ్‌ పాక్‌ యాక్టర్స్‌, సినిమాలకు సపోర్టు చేస్తుండటంపై నెటిజన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నరాఉ. ప్రకాశ్‌ రాజ్‌ తీరును తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌, బాలీవుడ్‌ భామ వాణీ కపూర్‌లు ప్రధాన హీరోహీరోయిన్లుగా ఆర్తి ఎస్‌.బగ్డి దర్శకత్వంలో వివేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా మే 9న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. కానీ అంతలోనే జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి జరగ్గా కేంద్రం పాకిస్తాన్‌ నటుల సినిమాలపై బ్యాన్ విధించింది.