Nani About His Car Accident: కారు ప్రమాదం.. ఆ రాత్రి నా నన్నేంతో మార్చింది

Nani Open Up On Death Experience When He Met Accident: హీరో నాని ప్రస్తుతం ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ (HIT3: The Third Case) మూవీ హిట్ జోష్‌తో ఉన్నాడు. సినిమా సక్సెస్‌లో భాగంగా వరుస ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా నాని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూలో ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని డార్క్ సైడ్, స్టార్ కిడ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తన జీవితాన్ని మార్చేసిన ఓ కారు ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నాడు.
చావు అంచుల వరకు వెళ్లొచ్చా
గతంలో తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందిస్తూ.. ఆ యాక్సిడెంట్ తన జీవితాన్ని మార్చేసిందని, అప్పటి నుంచి తాను జీవితాన్ని చూసే కోణంలో మార్పు వచ్చిందన్నాడు. ఈ మేరకు నాని మాట్లాడుతూ.. “గతంలో నేను ఓ యాక్సిడెంట్ గురయ్యాను. అప్పుడు చావు అంచుల వరకు వెళ్లొచ్చాను. అది నేను కారు కొనడానికి కంటే ముందే రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ రోజు నా ఫ్రెండ్ కారు తీసుకుని రాత్రి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాం. నేనే కారు నడిపాను. అక్కడ రోడ్డుపై నిలిపి ఉన్న లారీని మా కారుతో ఢీకొట్టాం. రాత్రి సమయంలో కావడంతో ముందు ఉన్న లారీ కనిపించలేదు. పైగా అది రోడ్డు మధ్యలోనే నిలిపి ఉంది.
నా శరీరమంతా రక్తంతో..
చాలా స్పీడ్‌తో వెళ్తున్న మేము లారీని ఢీకోట్టడంతో దాని వెనుక భాగంగా మా కారులోకి చోచ్చుకువచ్చింది. కారు అద్దం ముక్కలు కాడంతో నా శరీరమంత రక్తం. నా పక్క సీటులో కూర్చున్న నా స్నేహితుడు స్పృహ కొల్పోయాడు. చివరికి ఏదోక రకంగా కారు నుంచి బయటపడ్డాం. అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్తున్నాం. కాస్తా ముందుకు వెళ్లాక అక్కడ మరో యాక్సిడెంట్ జరిగింది. పెళ్లి వాహనానికి ప్రమాదం జరిగింది. వాళ్లంత పెళ్లి బట్టల్లో ఉన్నారు. చాలామందికి గాయాలు అయ్యాయి. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. తీవ్ర గాయాలతో ఉన్న ఆ పాపను మా అంబులెన్స్‌లోనే ఎక్కించారు. అప్పటికే గాయాలతో నొప్పితో ఉన్న మేము ఆ పాపను చూశాక మా సంగతి మర్చిపోయాము.
రాత్రంత ఐసీయూ ముందే ఉన్నా..
చిన్నారికి ఐసీయూలో చికిత్స అందించారు. ఆ రాత్రంత ఆ పాపకి ఎలా ఉందో తెలుసుకోవాలని ఐసీయూ ముందే ఉన్నాం. తెల్లవారు జాము వరకు అక్కడే ఉన్నాను. ఆ పాప పరిస్థితి క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. అది నన్నేంతో కలిచివేసింది. ఆ క్షణం నుంచి నాలో జీవితాన్ని చూసే కోణం మారింది. ఆ ఒక్క రాత్రి నన్నేంతో మార్చింది. ఆ రోజు జీవితం విలువ ఏంటో తెలిసింది. ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటామోఎ తెలియదు. ఏ క్షణం ఏమౌతుందో తెలియదు. కాబట్టి ఉన్న జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా గడాపాలని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని అర్థమైంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ ప్రమాదం తర్వాత తాను కార నడపడం చాలా తక్కువ అని, అవసరమైతే తప్పా డ్రైవ్ చేయనని చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
- Allu Arjun-Atlee Movie: సరికొత్త లుక్‌లోకి అల్లు అర్జున్ – అట్లీ మూవీ కోసం రంగంలోకి మహేష్, ఎన్టీఆర్ ఫిట్నెస్ ట్రైయినర్