Published On:

Malayalam Young Hero Vishnu Prasad: సినీ ఇండిస్ట్రీలో విషాదం.. ప్రముఖ యంగ్ హీరో కన్నుమూత

Malayalam Young Hero Vishnu Prasad: సినీ ఇండిస్ట్రీలో విషాదం.. ప్రముఖ యంగ్ హీరో కన్నుమూత

Malayalam Young Hero Vishnu Prasad passes away: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ యంగ్ హీరో విష్ణు ప్రసాద్(49) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఆయనను కేరళలోని ఎర్నాకులం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయనకు 20 రోజుల నుంచి చికిత్స అందిస్తున్నారు. కానీ ఇంతలోనే ఆయన చనిపోవడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

 

కాగా, ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా.. కాలేయ మార్పిడి కోసం రూ.30లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో ఆయన లివర్ పాడైనందున తన కూతురు లివర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో ట్రీట్ మెంట్ కోసం భారీగా అవసరం ఉండడంతో ఆయన ఫ్యామిలీ ఫండ్ రైజింగ్ కూాడ చేపట్టింది. అయితే ఇవాళ తెల్లవారుజామున 1 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

 

తొలుత ఆయన మృతి చెందిన విషయాన్ని తన మిత్రుడు కిషోర్ సత్య ప్రకటించారు. ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ‘ప్రియమైన మిత్రులకు విచారకరమైన వార్త చెబుతున్నారు. కాసేపటి క్రితం మన మిత్రుడు విష్ణు ప్రసాద్ ఇక లేరు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇంతలోనే లోకాన్ని వదిలిపెట్టి పోయాడు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆయన కుటుంబానికి అండగా ఉండేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని రాసుకొచ్చారు.

 

ఇదిలా ఉండగా, విష్ణుప్రసాద్.. తమిళ్ సినిమాలో ‘కాశి’తో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత రన్ వే, లయన్, బెన్ జాన్సన్, కాయ్ ఎతుమ్ దూర్త్, లోకనాథన్ ఐఏఎస్, మాంబళకాలం వంటి సినిమాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విష్ణుప్రసాద్ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లోనూ నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. తొడిముతలుమ్ ద్రిక్షక్షియమ్, సుడాని ఫ్రమ్ నైజీరియా వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. అయితే అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ అతడిని బతికించేందుకు నిధులు సేకరించింది. కానీ అతడి ఆరోగ్యం మరింత క్షీణించి మృతిచెందడంతో తోటి నటులు కన్నీటి పర్యంతమయ్యారు.