Published On:

Jack OTT Release: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న జాక్‌ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

Jack OTT Release: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న జాక్‌ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

Siddhu Jonnalagadda Jack Movie OTT Release: సిద్ధు జొన్నలగడ్డ, బేబీ ఫేం వైష్ణవి చైతన్యలు జంటగా నటించి చిత్రం ‘జాక్‌’. బొమ్మరిలు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 10న థియేటర్లలో విడుదలైంది. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాల తర్వాత సిద్ధు బాయ్‌ నటించి చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. హిట్‌ కొడుతుందనుకుంటే డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

 

ఈ సినిమాలో సిద్దు యాక్టింగ్‌ తప్పితే మారేది మెప్పించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. తాజాగా జాక్‌ డిజిటల్‌ ప్రీమియర్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాను మే 8న ఓటీటీలోకి తీసుకువస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. థియేటర్లలో కేవలం తెలుగులో రిలీజైన ఈ సినిమా ఓటీటీ మాత్రం పాన్‌ ఇండియా భాషల్లో అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో జాక్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ రావడంతో మూవీ లవర్స్‌ అంతా ఖుష్‌ అవుతున్నారు.

 

థియేటర్లలో మిస్‌ అయిన వారు జాక్‌ను ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారంత జాక్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ రావడంతో పండగ చేసుకుంటున్నారు. మరి బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన ఈ సిద్ధు బాయ్‌.. ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు ఈ సినిమాను నిర్మించారు. సుమారు రూ. 36 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్టు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. కాగా డిజే టిల్లు, టిల్లు స్క్వర్‌ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాయి. ఇక బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్‌ రాబట్టాయి. రెండు సినిమాల హిట్‌ జోష్‌ ఉన్న సిద్ధు జాక్‌తో హాట్రిక్‌ హిట్‌ కొట్టాలనుకున్నాడు. రిలీజ్‌ తర్వాత అంచనాలన్ని తలకిందులు అయ్యాయి. అంచనాలు తప్పడంతో మేకర్స్‌ భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది.