Published On:

Jackky Bhagnani: ఆ సినిమా డిజాస్టర్‌ – కోట్లలో నష్టం.. ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది: రకుల్‌ భర్త జాకీ భగ్నానీ

Jackky Bhagnani: ఆ సినిమా డిజాస్టర్‌ – కోట్లలో నష్టం.. ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది:  రకుల్‌ భర్త జాకీ భగ్నానీ

Jackky Bhagnani Says his family mortgaged properties For Bade Miyan Chote Miyan: కొంతకాలంగా బాలీవుడ్‌ పరిస్థితి దారుణంగా మారింది. దక్షిణాది చిత్రాలన్ని పాన్‌ ఇండియా అంటూ ఇంటర్నేషన్‌ స్థాయిలో దూసుకుపోతున్నాయి. కానీ హిందీ సినిమా మాత్రం వరుసగా బాక్సాఫీసు వద్ద ఢిలా పడుతున్నాయి. కొన్ని సినిమాలు తప్పితే ఏవి పెద్దగా కలెక్షన్స్‌ రాబట్డడం లేదు. కనీస పెట్టుబడి కూడా వెనక్కి రాకపోవడంతో నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 

తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్‌ నిర్మాత, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్ సింగ్‌ భర్త జాకీ భగ్నానీ స్పందించారు. ఓ సినిమా వల్ల ఆస్తులు అమ్ముకున్నామని, దానికి నుంచి తాను చాలా నేర్చుకున్నానన్నాడు. అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌లు ప్రధాన నటించిన ‘బడే మియా చోటే మియా’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దాదాపు ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌ నిర్మించారని బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం.

 

ఈ సినిమా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త జాకీ భగ్నానీ తండ్రి వాసు భగ్నానీ తమ సొంత బ్యానర్‌ పూజ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కనీస వసూళ్లు చూడా రాబట్టేకపోయింది. మొత్తం థియేట్రికల్‌ రన్‌లో ఈ చిత్రం రూ. 111.49 కోట్లు మాత్రమే రాబట్టింది. భారీ నష్టంతో నిర్మాత వాసు భగ్నానీ కుదేలయ్యాడు. ఈ నష్టం పూడ్చేందుకు ముంబైలోని తమ ఆఫీస్‌ను అమ్మేసి అప్పులు తీర్చిందని సమాచారం. తాజాగా దీనిపై రకుల్‌ భర్త జాకీ భగ్నానీ స్పందించాడు. ఆ మూవీ కోసం మేము చాలా డబ్బు ఖర్చు చేశామన్నది వాస్తవమన్నారు.

 

భారీ బడ్జెట్‌తో సినిమా తీశాం.. కానీ, ఎక్కడో కంటెంట్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవదన్న అనుమానం వచ్చిందన్నారు. రిలీజ్ అయ్యాక ఆ అనుమానమే నిజమైంది. ఆ చిత్రం ప్రజాదరణ పొందలేకపోయింది. ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకు నచ్చలేదని తెలుసుకునే ప్రయత్నం చేశాను, ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ అవ్వకుడదు కదా. ఇప్పుడీ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ ఒక్క సంఘటనతో చాలా నేర్చుకున్నానని చెప్పాడు. ఇప్పుడీ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశాం.. ఆ బాధ ఎవరికి అర్థం కాదంటూ చెప్పుకొచ్చాడు.